Ads
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బాలనటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా చేసిన చిత్రం బాలరామాయణం. ఈ సినిమాలో నటించిన వారంతా పిల్లలే కావడం విశేషం.
Ads
1996లో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ చేసారు. ఈ సినిమాను మల్లెమాల సుందర రామిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేసారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామునిపాత్రలో నటించాడు. ఈ సినిమా జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. ఇక ఈ పౌరాణిక చిత్రంలో సీతగా నటించిన చిన్నారి తన నటనతో అందరిని చాలా ఆకట్టుకుంది. ఆమె పేరు స్మిత మాధవ్. ఇక ఈ మూవీ విడుదలై 25 సంవత్సరాలు అయ్యింది. అప్పటి చిన్నారి సీత ప్రస్తుతం ఎలా ఉందో? ఏం చేస్తుందో చూద్దాం..
స్మితా మాధవ్ భరతనాట్యం డాన్సర్ మరియు కర్నాటిక్ క్లాసికల్ గాయని. మంచి డ్యాన్సర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇప్పటికే ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చింది. అంతేకాకుండా విదేశాల్లో కూడా చాలా షోలు చేసింది. అమెరికా, ఆస్ర్టేలియా, సింగపూర్, మలేషియా, వియత్నాంతో సహా పలు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా తీసుకున్నారు.
స్మితా మాధవ్ శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ దగ్గర భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఇక కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో హైదరాబాద్ సిస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యం, సంగీతంలో డిప్లొమా పూర్తి చేసింది.
మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో మాస్టర్స్ చేసింది. ఇక బాలరామాయణం మూవీ తరువాత, ఇటీవల ఆర్ట్ ఫిల్మ్ పృథ్వీలో హీరోయిన్ గా నటించింది. స్మితా మాధవ్ టెలివిజన్ పై చాలా భాషల్లో పలు షోలకు యాంకరింగ్ కూడా చేసింది. అంతేకాకుండా స్మితా మాధవ్ శిక్షణ కూడా ఇస్తోంది.
Also Read: బిగ్ బాస్ సీజన్ 6 విజేత రేవంత్! కానీ అక్కడే ట్విస్ట్.. అది ఏమిటో తెలుసా?