“గుప్పెడంత మనసు”లో అనుపమగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎవరో తెలుసా..? ఈ ఫోటోలు ఒక లుక్ వేయండి..!

Ads

గుప్పెడంతమనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. జగతి పాత్ర మరణించిన తర్వాత ఈ సీరియల్ లో  కొత్త పాత్ర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ పాత్ర పేరు అనుపమ.

అనుపమ ఎంట్రీ తరువాత గుప్పెడంతమనసు సీరియల్ ఉత్కంఠగా భరితంగా సాగుతోంది. అనుపమకు జగతి గురించి చెప్పకుండా మహేంద్ర దాటవేస్తుంటాడు. లేటెస్ట్ ఎపిసోడ్ లో అనుపమ రిషిని కాపాడుతుంది. అయితే అనుపమగా నటిస్తున్న ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా నటిస్తున్న నటి పేరు చంద్ర లక్ష్మణ్. ఆమె మళయాల నటి. చంద్ర లక్ష్మణ్ త్రివేండ్రంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆ తరువాత వారి కుటుంబం చెన్నైకి వెళ్ళి, అక్కడే స్థిరపడ్డారు. చంద్ర లక్ష్మణ్ చెన్నైలోనే పాఠశాల చదువు మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత హోటల్ మేనేజ్‌మెంట్ చేసింది. ఆమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఆమెను చూసిన తమిళ దర్శకుడు సంతోష్ తన సినిమాలో ఒక పాత్రకు ఆమెను తీసుకోవాలని అనుకున్నారు.
అలా చంద్ర లక్ష్మణ్ 2002లో వచ్చిన తమిళ సినిమా ‘మనసెల్లం’ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ పాత్రకు గుర్తింపు రావడంతో ఆమెకు అవకాశాలు వచ్చాయి. అప్పటి నుండి ఆమె మలయాళ, తమిళ చిత్రాలలో కలిపి దాదాపు పది చిత్రాలలో నటించింది. ఆ తరువాత టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. వాటి ద్వారా ఆమె కు మరింత గుర్తింపు వచ్చింది. ఆమె నటించిన మొదటి సీరియల్  ‘స్వాంతమ్’.
ఈ సీరియల్ ఆమె విలన్ పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాగా పాపులర్ అయ్యారు. అదే ఆమె ఇంటి పేరుగా మారింది. 2021లో తన సహ నటుడు అయిన తోష్ క్రిస్టీని పెళ్లి చేసుకుంది. వారికి ఒక బాబు ఉన్నాడు. ఇక తెలుగు బుల్లితెర పై గుప్పెడంతమనసు సీరియల్ చంద్ర లక్ష్మణ్ తొలి సీరియల్ కాదు. ఇంతకు ముందు జెమినీలో ప్రసారం అయిన మమతల కోవెలలో, స్టార్ మాలో వచ్చిన సీతాకోక చిలుక సీరియల్స్ లో నటించింది.

Ads

Also Read: Review: కంచెరపాలెం ఫేమ్ కార్తీక్ నటించిన “లింగోచ్చా” సినిమా ఎలా ఉంది..? అసలు లింగోచ్చా అంటే ఏంటి..? 

 

Previous articleReview: కంచెరపాలెం ఫేమ్ కార్తీక్ నటించిన “లింగోచ్చా” సినిమా ఎలా ఉంది..? అసలు లింగోచ్చా అంటే ఏంటి..?
Next articleహార్దిక్ పాండ్య స్థానంలో టీం లోకి ఆ ఆల్ రౌండర్ ని తీసుకురానున్న రోహిత్…పెద్ద ప్లాన్ వేసాడుగా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.