Ads
సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ సినీ పరిశ్రమలో నటదిగ్గజం. అభిమానులు ‘తలైవా’ అని పిలుచుకునే రజినీకాంత్ కు, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి, బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.
Ads
రజినీ కాంత్ సినిమాల్లో ఎక్కువగా బాబా ముద్రను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ బొటనవేలు, చూపుడు వేలుతో కలిపి ఉంచే ముద్ర ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ రజనీకాంత్ 1950లో కర్ణాటకలోని మరాఠా ఫ్యామిలిలో డిసెంబర్ 12న శివాజీ రావ్ గైక్వాడ్ గా జన్మించారు. బస్ కండక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదట్లో చిన్న చిన్న పత్రాలు, విలన్ గా నటించిన రజినీ, హీరోగా మారి తక్కువ సమయంలోనే అగ్రహీరోగా ఎదిగారు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరిగా నిలిచారు.
తన నటనతో, స్టైల్ తో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఆన్ స్క్రీన్ పైన రజనీకాంత్ నటనను అభిమానిస్తే, ఆఫ్-స్క్రీన్ లో ఆయన సింప్లిసిటీని అభిమానులే కాకుండా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. రీసెంట్ గా రజినీకాంత్ ప్రధానపాత్రలో నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.
ఇది ఇలా ఉంటే, రజనీకాంత్ బొటనవేలు, చూపుడు వేలుతో ఉన్న ముద్ర కలిగిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ ముద్ర వెనుక కారణాలను యోగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, “రజనీకాంత్ బొటనవేలు, చూపుడు వేళ్ళతో పెట్టే ముద్రను చిన్ ముద్ర అని, ఈ ముద్ర వల్ల చేయడం వల్ల మెదడులో ఉన్న నరాల పనితీరు మెరుగ్గా ఉంటుందట. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరిగి, ఒత్తిడిని తగ్గిస్తుందట. కోపం, నిద్రలేమి, తలనొప్పిని తొలగిస్తుంది. ఈ ముద్రలో కూర్చున్నప్పుడు,శరీరంలోని నరాలను శాంతింపజేయడమే కాకుండా దృష్టి మరలకుండా చేస్తుందట. అందువల్లే ఈ ముద్రను యోగా చేసే సమయంలో ఉపయోగిస్తారని అంటున్నారు.
Also Read: గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ హీరో ఎవరో తెలుసా..? ఇటీవలే సూపర్ హిట్ కొట్టారు..!