మెగా ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలో ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? వాస్తవాలు తెలియకుండా ఎందుకు ఇలా రాస్తున్నారు.?

Ads

మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్, హీరోయిన్​ లావణ్య త్రిపాఠిని త్వరలోనే వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్ళ నుండి ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పెద్దల సమక్షంలో  పెళ్లి చేసుకోబోతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు మరో మెగా హీరో ఒక టాలీవుడ్ హీరోయిన్ తో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం అల్లు అర్జున్‌ ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫోటోలు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలు ప్రారంభం అయ్యాయి. దీనిలో భాగంగానే ఇటీవల  మెగాస్టార్​ చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. తాజాగా కాబోయే నూతన వధూవరులకు అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అల్లు కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు కూడా ఈ పార్టీలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ పార్టీలో కాబోయే నూతన వధూవరులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో పాటుగా చిరంజీవి, సురేఖ, నాగబాబు, పద్మజ, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. ఇక వీరందరూ కుటుంబ సభ్యులు, వీరితో హీరో నితిన్ ఆయన వైఫ్ తో కలిసి వచ్చారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ రీతు వర్మ కూడా ఈ పార్టీకి హాజరు అయ్యింది. దీంతో దీంతో ఈ విషయం ట్రెండింగ్ గా మారింది. నితిన్ భార్య షాలిని మెగా ఫ్యామిలీకి బంధువు అని అందరికి తెల్సిందే. అందుకే మెగా ఫామిలీ ఫంక్షన్ లో నితిన్ భార్యతో హాజరయ్యారు.
అయితే ప్రస్తుతం రీతు వర్మ మెగా ఫ్యామిలీలో ఎవరి మూవీలో కూడా నటించడం లేదు. మరి ఈ పార్టీకు రీతూ వర్మ ఎందుకు వచ్చింది అని సందేహం కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది వాస్తవాలు తెలియకుండానే ఓ మెగా హీరోతో ఈ హీరోయిన్ లవ్ లో ఉంది ఏమో అని కూడా రాసేస్తున్నారు. అయితే రీతూ వర్మకి మెగా హీరోతో మంచి స్నేహం ఉందట. ఫోటోలో కన్పిస్తే మెగా హీరోతో లవ్ లో ఉందా అని రాస్తారా, మంచి ఫ్రెండ్ కూడా కావచ్చు కదా.? వాస్తవాలు తెలియకుండా ఎందుకు ఇలా రాస్తున్నారు.?

Ads

Also Read: ఈ సినిమా గురించి తెలిసే జాతీయ అవార్డు ఇచ్చారా.? అది కూడా అంత మంచి సినిమాను పక్కన పెట్టి.!

 

Previous articleఇది అసలు వరల్డ్ కప్ మ్యాచేనా అన్నారు..? కానీ ఇలా జరగడం కొత్తేమీ కాదు కదా.?
Next articleఅంత మంచి బౌలర్ కి ఏంటి ఈ పరిస్థితి.? రోహిత్ ఇకనైనా మేలుకుంటాడా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.