Ads
వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు పోయాల్సిన యువ వైద్యురాలు ఆ-త్మ-హ-త్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. వరకట్నం కోసం చేసిన డిమాండ్లు తీర్చలేదని వరుడు పెళ్లి చేసుకోను అనడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. కట్నం కారణంగా పెళ్లి రద్దు కావడంతో మనస్థాపం చెందిన తన చావుకు గల కారణాలను డె-త్ నోట్ లో రాసి ఆ-త్మ-హ-త్య కు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే..తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో షహానా పీజీ చదువుతోంది అదే కాలేజీ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న రువైస్..సహానా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు.. కానీ అబ్బాయి కుటుంబం బంగారం, భూమితో పాటు బీఎండబ్ల్యూ కారు కూడా కావాలని వరకట్నం కింద గొంతెమ్మ కోర్కెలు కోరారు. 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి.. ఇవేవీ చాలవు అన్నట్టు బీఎండబ్ల్యూ కారు.. ఇంత భారీ డిమాండ్ తీర్చడానికి షహానా కుటుంబ స్తోమత సరిపోదు. ఇక దీంతో రువైస్ కుటుంబం పెళ్లి రద్దు చేసింది.
Ads
పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయిన షహానా.. ఆ-త్మ-హ-త్య-కు పాల్పడింది. ఆమె అపార్ట్మెంట్లో లభించినటువంటి సూసైడ్ నోట్ ద్వారా పోలీసులకు అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా ఛార్జ్.. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. రువైస్.. అతని కుటుంబంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతోంది