బాలయ్యకి “భగవంత్ కేసరి”లో బాలయ్య తల్లికి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

Ads

నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మాస్, ఎమోషనల్ సినిమా భగవంత్ కేసరి. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ అయ్యి, తొలి షోతోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర మూడో వారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా, శ్రీలీల కీలక పాత్రలో నటించింది. విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించారు. అయితే ఈ మూవీలో బాలయ్యకు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ నటించింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు చూద్దాం..
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధానపాత్రలలో నటించిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 19న దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ మూడవ వారంలోనూ విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో పోటీ పడుతూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
దీంతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ నమోదు అయ్యాయి. బాలయ్య, శ్రీలీల పాత్రలు, నేపధ్య సంగీతం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సన్నివేశం, ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా చూడడానికే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ జయచిత్ర నటించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో హీరోయిన్ గా అలరించారు. దాదాపు 200 పైగా చిత్రాలలో నటించి, మెప్పించారు.
ప్రస్తుతం జయచిత్ర వయసు 66 సంవత్సరాలు. ఆమె బాలకృష్ణకి తల్లిగా నటించింది. అయితే బాలయ్య వయసు ప్రస్తుతం 63. తల్లి కొడుకులుగా నటించిన జయచిత్ర, బాలకృష్ణల మధ్య ఏజ్ గ్యాప్ మూడు సంవత్సరాలు మాత్రమే. దీంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Ads

Also Read: “కేసీఆర్‌ కోసం ఇల్లు తాకట్టు పెట్టా..! వాళ్ళు మోసం చేశారని..?” అంటూ… “రాకింగ్‌ రాకేశ్‌” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

Previous articleపార్ట్-1 సూపర్ హిట్… ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది..! అసలు ఏం ఉంది ఈ సినిమాలో..?
Next articleప్రియాంక మోహన్ ఇలా బొద్దుగా మారడానికి కారణం ఆ హీరో అంట.. ఎందుకంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.