Ads
మనుషులకి విశ్వాసం చూపించే జంతువులలో ముందుగా కుక్క పేరు ఉంటుంది. ఒక్క పూట అన్నం పెడితే అవి మనకు చూపించే విశ్వాసం అంతా, ఇంతా కాదు. మనుషులకి చాలా తొందరగా దగ్గరయిపోయే జంతువు కూడా కుక్కే. అలాంటి కుక్కలు మనుషులను ప్రమాదాల బారిన పడకుండా రక్షిస్తాయా? జాగ్రత్త పడకుండా హెచ్చరిస్తాయా? అనే ప్రశ్న తలెత్తితే అవును అని సమాధానమే ఈ కుక్క.
రైలులో ఫుట్ బోర్డు మీద కూర్చొని లేదా వేలాడుతూ చాలామంది వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ప్రమాదం అని తెలిసినా కూడా సాహసాలు చేస్తూ ఉంటారు కొందరు యువకులు. అది ప్రమాదం అని అధికారులు అక్కడ బోర్డులు పెట్టిన కూడా ఎవరు ఖాతరు చేయరు. అయితే ఈ కుక్క ఫుట్ బోర్డు మీద కూర్చోవద్దంటూ సదరు ప్యాసింజర్లను హెచ్చరిస్తూ తన భాషలో మొరుగుతూ ఉంటుంది.
అలా ట్రైన్ బోగీలు కదులుతుంటే తాను కూడా ఫాలో అవుతూ అలా ఫుట్ బోర్డు మీద కూర్చుని ఏ ప్యాసింజర్ కనిపించినా లోపలికి పొండి అన్నట్లు మొరిగి హెచ్చరిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ఐఆర్ఐఎస్ అధికారి అనంత రూపనగుడి ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫుట్ బోర్డుపై కూర్చొని ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో అని ఆ కుక్క అప్రమత్తం చేస్తున్న తీరును చూసి అయినా మార్పు వస్తే బాగుంటుంది అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
Ads
ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్స్ కుక్కకి సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అంటూ ఇండియన్ రైల్వే బోర్డుకి రిక్వెస్ట్ పెడుతున్నారు. కుక్క వింత ప్రవర్తనతో ప్రయాణికులు తమ తప్పు తెలుసుకొని రైలు లోపలికి వెళ్లే లాగా చేస్తుంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు రూపనగుడి. అయితే ఈ కుక్క ఎందుకు ఇలా చేస్తుంది అన్న దానికి కారణాలు మాత్రం తెలియడం లేదు అయితే రూపన గుడి పెట్టిన వీడియోకి రెండు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం రైలుకు దగ్గరగా పరిగెత్తడం వల్ల కుక్క గాయపడుతుందేమో అని చాలామంది ప్రయాణికులు ఆందోళనలు కూడా చెందుతున్నారు.
The best assistance rendered in a drive against the foot board travelling. 😀😛😂 #IndianRailways #SafetyFirst pic.twitter.com/vRozr5vnuz
— Ananth Rupanagudi (@Ananth_IRAS) December 29, 2023