Ads
ఒక చిన్నపిల్లాడిని తీర్చి దిద్ది..ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన అపర మేధా సంపనుడు…ఆచార్య చాణక్యుడు. అలాంటి బృహస్పతి మన కోసం…మానవ మనుగడ విధి విధానాలు నేర్చుకొనడం కోసం తెలియపరచిన కొన్ని అద్భుతమైన సూక్తుల పరంపర చాణిక్య నీతి. జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని చాణిక్యుడు ఎంతో సులువైన ఉదాహరణలతో వివరించి చెప్పారు.
అందులో ఒకటి ముఖ్యంగా ఎటువంటి మహిళలను మనం జీవితంలో నమ్మకూడదు అన్న విషయంపై కూడా ఉంది. ఆడవాళ్లు ఆదిశక్తి రూపాలు.. ఇంటికి మంచి చేయడానికి తాపత్రయ పడతారు.. అందులో సందేహం లేదు. అయితే అందరి విషయంలో మనం దీన్ని కచ్చితంగా చెప్పలేము.. స్త్రీలను నమ్మి ఎందరో మోసపోయారు అనడానికి మన చరిత్ర ఒక పెద్ద ఉదాహరణ. అందుకే చాణిక్యుడు చెప్పిన విధంగా ఈ కింది లక్షణాలు కలిగిన ఆడవారిని అస్సలు నమ్మకండి.
Ads
చెడు స్వభావం ఉన్న స్త్రీలు ఎప్పుడు కూడా పరపురుషుడి వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అలాంటప్పుడు వాళ్ళకి తమ సొంత భర్తే శత్రువులా కనిపిస్తాడు. ఇక అటువంటి సందర్భంలో సంసారం కల్లోల సాగరమే అవుతుంది. అంతర్ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా.. కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే మహిళలను అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే అందం కంటే గుణం, విద్య, సత్ప్రవర్తన మనిషి యొక్క మనుగడకు ప్రధాన సూత్రాలు.
అలాగే ఎక్కువ దురాశ కలిగిన స్త్రీ ఎంతో ప్రమాదకరం. ఆమె తాను అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం కుటుంబంలో అల్లకల్లోలం రేపుతుంది. అలాగే అహంకారంగా ఉన్న స్త్రీ కి దూరంగా ఉండటమే మంచిది. అలాంటి వారిపై లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం అస్సలు ఉండవు. వీరికి జ్ఞానం, తెలివితేటలు శూన్యం. అటువంటి వారితో ప్రయాణం చెల్లెలు ఉన్న పడవలో సముద్రాన్ని దాటడంతో సమానం. విద్యావంతురాలు అయిన అమ్మాయి పది తరాల వరకు తన విద్యను అందిస్తుంది.. అలాగే సుగుణవతి అయిన స్త్రీ తన సుగుణాన్ని రాబోయే పది తరాల వరకు పెంపొందిస్తుంది.