Ads
చాలామందికి టీలు గాని కాఫీలు గాని తాగినప్పుడు అందులో కాంబినేషన్ గా రస్క్ తీసుకోవడం అలవాటు. చాలామందికి డైలీ లైఫ్ లో అది ఒక అలవాటుగా మారిపోతుంది. అయితే వైట్ బ్రెడ్ రస్క్ అంత మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. హోల్ వీట్ రస్క్ ఇందుకోసం మంచి ఎంపిక అంటున్నారు. హోల్ వీట్ బ్రెడ్ అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ లను అందిస్తుంది. ఈ రెండు రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
హోల్ వీట్ రస్క్ లో మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. పోషకాహార ప్రయోజనాలను పెంచుకోవడానికి తక్కువ క్యాలరీలు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ పిండిని లేదా తినధాన్యాలతో చేసిన బ్రెడ్ ని ఉపయోగించి ఇంట్లో రస్కులుగా తయారు చేసుకోవచ్చు. ఇందులో కూడా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. టీ తో పాటు రస్క్ తినటం వలన కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము.
Ads
రస్కుల తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు పిండి, చక్కెర, ఈస్ట్, నూనె. మార్కెట్లలో లభించే రస్కులలో ఎక్కువ భాగం పాత బ్రెడ్ నుంచి తయారుచేసినవే కాలం చెల్లిన రోట్టితో చేసే ఈ రస్కులను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాము బ్రెడ్ లో దాని గడువు తేదీకి మించి తినని రొట్టెలో బూజు, విషపూరిత పదార్థం ఉన్నందున అతిసారం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఇది ఎలర్జీతో కూడిన చర్మానికి కారణం అవుతుంది.
దురద, వాపు కి కూడా కారణం అవుతుంది. ఇందులో వాడే నూనె కూడా తిరిగి వాడితే అనారోగ్యం తప్పదు. రస్క్ తయారీలో ఎక్కువగా నూనె నెయ్యి లేదా వనస్పతి రూపంలో ఉంటుంది ఇది రక్తనాళాలలో గడ్డ కట్టడం గుండెపోటుకు కారణం అవుతుంది. కాబట్టి మిల్క్ రస్క్ యూస్ చేయటం కన్నా హోల్ వీట్ రస్కు టీ కాంబినేషన్ గా తీసుకోవటం మంచిది.