Ads
చంద్రగుప్తుడు లాంటి వ్యక్తిని ఒక మహా సామ్రాజ్యానికి అధినేతగా చేసిన గొప్ప గురువు చాణక్యుడు. ఆయన చెప్పిన విషయాలు జీవిత సత్యాలు…మన మనుగడ కోసం సాయం చేయడానికి చాణిక్యుడు ఎంతో అనుభవంతో మనకు అందించిన జ్ఞానమే చాణక్యనీతి. జీవితంలో ముందుకు వెళ్లడం కోసం ఎవరికి సాయం చేయాలి.. ఎటువంటి వారికి సాయం చేయకూడదు అనే విషయంపై చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా..?
చాలా సందర్భాలలో ఆపదలో ఉన్న అమ్మాయిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అయితే అమ్మాయి నిజంగా కష్టాల్లో కూరుకుపోయిందో లేక తాను చేసిన తప్పు వల్ల ఆ పరిస్థితుల్లో ఉందా అన్న విషయాన్ని తెలుసుకునే తెలివితేటలు ఒక వ్యక్తికి ఉండాలి. కావాలని మళ్లీ మళ్లీ అదే తప్పుచేసి ఆపదలో పడ్డ అమ్మాయిని ఆదుకోవాలి అని వెళ్తే మాత్రం అన్యాయం అయిపోవడం కన్ఫామ్ అంటున్నాడు చాణిక్యుడు. ఎందుకంటే… అలాంటి అమ్మాయిలు ఎవరి విధేయత చూపరు కాబట్టి అలాంటి వారికి సాయం చేయడం వల్ల చేసేవారు ఇబ్బంది పాలవుతారు.
Ads
అలాగే ఎటువంటి కారణం లేకుండా కావాలని ఒంటరిగా, దుఃఖం నటిస్తూ ఉండే వ్యక్తులకు కూడా ఎప్పుడూ దూరంగా ఉండాలి అని చాణిక్యుడు సూచిస్తున్నాడు సూచిస్తున్నాడు. వారు ఎప్పుడూ తన దగ్గర లేని దానికోసం తహతలాడుతూ ఉంటారు.. అలాంటివారు కచ్చితంగా మీ దగ్గర ఉన్న వాటిని చూసి బాధపడడమే కాకుండా ఎప్పుడు మీపై అసూయతో ఉంటారు. అలాంటి వారికి ఎప్పటికీ సహాయం చేయకూడదు.
తెలివి తక్కువ వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇటువంటి వారికి ప్రపంచంలో జరిగే విషయాలపై అవగాహన ఉండదు ,ఆందోళన ఉండదు. వారి ధ్యాస ఎప్పుడు ఇతరుల తప్పులను వెతకడం పైనే ఉంటుంది. అందుకే ఇటువంటి మూర్ఖులకు సలహా ఇవ్వడం, సహాయం చేయడం వంటివి అసలు చేయకూడదు. అర్థం చేసుకోరు సరి కదా మిమ్మల్ని అనుమానిస్తారు.