Ads
మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద రకరకాల వస్తువులు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది చూసి చూడనట్లుగా వాటి పక్కనే లేదా వాటిని తొక్కుకుంటూ వెళ్తుంటారు.
Ads
అయితే రోడ్డు మీద ఉండే కొన్ని వస్తువులను కొన్ని సందర్భాలలో తాకాకుండా వాటికి దూరంగా నడిచి వెళ్ళాలి. అలా కాకుండా పొరపాటున అయినా సరే ఆ వస్తువులను తొక్కినా లేదా దాటి వెళ్ళినా దరిద్రం చుట్టుకుంటుందంట. మరి రోడ్డు మీద ఉండే ఎలాంటి వస్తువులకు దూరంగా నడవాలో ఇప్పుడు చూద్దాం. ఎప్పటినుండో దిష్టి తీయడం అనే పద్ధతిని ఇప్పటికీ కూడా చాలామంది పాటిస్తూనే ఉన్నారు. ఇక దిష్టి ఎందుకు తీస్తారంటే ఇంట్లో ఎవరికైనా బాలేనప్పుడు, చిన్న పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు, ఇంట్లో బాలేకపోవడం లాంటి సందర్భాలలో దిష్టి తీస్తుంటారు.సాధారణంగా దిష్టి తీసిన తరువాత ఆ వస్తువులను రోడ్డు మీదనే పడేస్తూ ఉంటారు. ఇక దిష్టి తీయడానికి ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు, వెంట్రుకలు, నాణేలు వంటి వస్తువులను వాడుతూ ఉంటారు.ఇక దిష్టి తీసి పడేసిన ఈ వస్తువులను దాటి వెళ్ళడం కానీ,తొక్కి వెళ్ళడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే వెంట్రుకలను చూడటమే చెడుగా భావిస్తారు. ఇక వెంట్రుకల మీద నుండి దాటి వెళ్ళడం వల్ల రాహుగ్రహం ప్రభావితం అవుతుంది. అందుకే రోడ్డు మీద కనిపించే వెంట్రుకలకు దూరంగా వెళ్ళడం మంచిది.
అలాగే రోడ్డు మీద ఉండే నిమ్మకాయ కానీ మిరపకాయలు కానీ కనిపిస్తే వాటికి దూరంగా నడిచి వెళ్ళాలి. వాటితో దిష్టి తీసిగాని లేదా చేతబడి చేసి అలా రోడ్డు పై పారేసి ఉండే అవకాశం ఉంది. వాటిని దాటుకొని వెళ్ళటం వల్ల ఎవరికైతే దిష్టి తీశారో, వారి దరిద్రం వాటిని దాటి వెళ్ళినా వారికి చుట్టుకుంటుంది. అలాగే రోడ్డు పై బూడిద లేదా కాలిన కట్టెలు ఉంటే వాటికి దూరంగా వెళ్ళాలి. ఇక ఇలాంటివి నెగెటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి. అలా దాటడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. దారిలో చనిపోయిన జంతువు కనుక కనిపించినట్లయితే వెంటనే వేరే దార్ నుండి వెళ్ళాలి. జంతువు మృతదేహాన్ని దాటిన, దగ్గర నుండి వెళ్ళినా మీ జీవితంలోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
Also read: ఒకరి బట్టలని మరొకరు కట్టుకుంటే ఏం జరుగుతుంది..?