Ads
ఆదివారం వచ్చిందంటే చాలామందికి నాన్ వెజ్ లేనిదే ముద్ద నోట్లోకి వెళ్ళదు. అందులో ఎక్కువ మంది ఓటు వేసేది చికెన్ కే, ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చికెన్‌ను లొట్టలేసుకుంటూ తినేవారికి నిపుణులు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
చాలామంది వండటానికి ముందుగా చికెన్‌ను ట్యాప్ వాటర్ (నీటి ధార) కింద కడుగుతారు. అయితే ఇలా కడగడం వల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట. చికెన్ షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే చికెన్ శుభ్రం చేయడానికి, గిన్నెలో చికెన్ వేసి ట్యాప్ వాటర్ కింద పెట్టి కడుగుతూ ఉంటారు. నిపుణులు ఇలా చేయకూడదని చెప్తున్నారు. చికెన్‌ను నీటి ధార కింద పెట్టి కడగవద్దని, అలా చేస్తే రోగాలు వస్తాయని చెబుతున్నారు.
ఎందుకంటే చికెన్‌ను ట్యాప్ కింద పెట్టి కడిగేప్పుడు చికెన్ మీద పడ్డ వాటర్ ద్వారా వచ్చే తుంపర్లు కిచెన్ అంతా చిమ్ముతాయి. ఆ తుంపర్ల ద్వారా సాల్మొనెల్లా, కాంపైలోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు ఆ గదిలో వ్యాపిస్తాయని నిపుణులు తెలియచేస్తున్నారు. ఆ బ్యాక్టీరియాల వల్ల అనేక జబ్బులు వస్తాయని, అందుకే చికెన్‌ను ట్యాప్ వాటర్ కింద పెట్టి కడవద్దని హెచ్చరిస్తున్నారు. అయితే ఇంతకుముందు కూడా చాలా మంది నిపుణులు దీని పై ప్రజలను హెచ్చరించారు. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది ఈ అలవాటును మానకుండా ట్యాప్ కిందే చికెన్ ను కడుగుతున్నారు. ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఇటీవల జరిపిన ఒక సర్వేలో ఈ విషయం ఋజువు అయ్యింది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే చాలా మంది ట్యాప్ వాటర్ కింద చికెన్‌ను కడిగడం ద్వారా ఈ వ్యాధుల బారినపడ్డారట. ఇంకా చెప్పాలంటే ఆ దేశంలో సగానికంటే ఎక్కువ ప్రజలు చికెన్ ను నీటి ధార కిందనే శుభ్రం చేస్తున్నారంట. ఈ కారణంగా గత ఇరవై ఏళ్లలో ఆస్ట్రేలియాలో సాల్మొనెల్లా, కాంపైలోబాక్టర్ ఇన్‌ఫెక్షన్లు దాదాపుగా రెట్టింపు అయ్యాయని చెబుతున్నారు. దానివల్ల ఈ అలవాటును మనుకుంటే ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి, తన తండ్రి వెంకట్రావ్ తో కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?