ఆ థియేటర్‌‌ నుండి డంకీ అవుట్.. బాలీవుడ్ బాద్షా కెరీర్‌లోనే ఘోర అవమానం..

Ads

2023 చివరో వారంలో బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అయిన విషయం తెలిసిందే. రెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి.

సలార్, డంకీ చిత్రాల మధ్య భారీ పోటీ వాతావరణం ఏర్పడింది. రిలీజ్ ముందు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో జరిగిన విషయం తెలిసిందే. థియేటర్ల కేటాయింపులో కూడా వివాదం ఏర్పడింది. డంకీ మూవీకి ఎక్కువ స్క్రీన్లు, సలార్‌కు తక్కువ కేటాయించారు. అయితే థియేటర్ నుండి షారుక్ మూవీని తొలగించి సలార్ మూవీని వేయడం హాట్ టాపిక్ గా మారింది.
షారుఖ్ ఖాన్ డంకీ డిసెంబర్ 21న విడుదల కాగా, ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న విడుదల అయ్యింది. సలార్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాగా, షారుక్ డంకీ హిందీ భాషలో మాత్రమే విడుదల అయ్యింది. రిలీజ్ కు ముందు డంకీ మూవీకి ఎక్కువ థియేటర్లు, సలార్ కు తక్కువ థియేటర్లు కేటాయించడం పెద్ద గోడవకు దారి తీసింది. ఒక్క రోజు ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డంకీ మూవీ మిక్స్డ్ టాక్ తో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
మరో వైపు సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రసిద్ధ థియేటర్ మరాఠా మందిర్ షారుక్ కి షాక్ ఇచ్చింది. ఈ థియేటర్‌లో డంకీ మూవీ 3 షోలు తొలగించి, సలార్ మూవీని వేశారు. ఈ థియేటర్ షారుక్ కు లక్కీ థియేటర్‌ అని చెప్పుకుంటారు. దిల్‌వాలే దుల్హానియా మూవీ ఈ థియేటర్‌లో కొన్ని ఏళ్ళు ప్రదర్శించబడి రికార్డులు సృష్టించింది.
ఆ థియేటర్‌లో షారుక్ డంకీ సినిమాకి ఎక్కువ షోలు కేటాయించారు. సలార్‌ షోలకు ఈ థియేటర్‌లో పర్మిషన్ ఇవ్వకపోవడం కూడా వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ థియేటర్ లో కలెక్షన్స్ కురిపిస్తున్న సలార్ మూవీ షోలను వేస్తున్నారు. ఇదో రకంగా షారుక్ కు అవమానం అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మరింకని తెలుస్తోంది.

Ads

Also Read: న్యూ ఇయర్ కి అందరు హీరోయిన్స్ పబ్ లకి వెళ్తే…”సాయి పల్లవి” మాత్రం ఏం చేసారో తెలుసా.?

Previous articleఅప్పుడు మహేష్ కొడుకుగా, ఇప్పుడు మహేష్ కు పోటీగా అంటూ వస్తున్న వార్తల పై తేజ సజ్జ రియాక్షన్..!
Next articleఆటో డ్రైవర్లు సైడ్ కి కూర్చోవడం వెనకున్న కారణాలు ఏమిటో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.