Ads
డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరు. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో రోబో సినిమా సంచలనం సృష్టించింది.
అయితే ఈ హిట్ మూవీలో ముందుగా అనుకున్న హీరో రజనీకాంత్ కాదంట. మరి ఆ హీరో ఎవరో, ఎందుకు రోబో మూవీలో నటించలేదో, ఆ స్థానంలోకి సూపర్ స్టార్ రజిని కాంత్ ఎలా వచ్చారో ఇప్పుడు చూద్దాం. శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో శంకర్ ఈ సినిమాకి రీమేక్ గా హిందీలో అనిల్ కపూర్ తో నాయక్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ మూవీ నిరాశ పరిచింది. ఈ మూవీ తర్వాత శంకర్ రోబో స్టోరిని అనుకున్నారు.
అయితే కోట్ల బడ్జెట్ తో నిర్మించాల్సిన సినిమా అవడంతో ఈ మూవీని ముందుగా కమలహాసన్, ప్రీతిజింతాతో ఫోటోషూట్ చేశారు. ఈ మూవీ నిర్మాణానికి మీడియా డ్రీమ్స్ సంస్థ ముందుకు వచ్చింది. అయితే స్టోరి విషయంలో శంకర్, కమలహాసన్ కి భేదభిప్రాయాలు వచ్చాయి.
Ads
దీంతో శంకర్ ఈ మూవీని పక్కకు పెట్టి, బాయ్స్ మూవీని తీశాడు. ఈ చిత్రం హిట్ అయ్యింది. దాంతో రోబోను మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఈ సినిమా స్టోరిని షారుక్ ఖాన్ కి చెప్పారు. స్టోరీ విన్న షారుఖ్ ఖాన్ వెంటనే ఒప్పుకుని, తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని కూడా చెప్పారు.ఈ మూవీలో కరీనా కపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఇంతలోనే స్టోరి విషయంలో ఇద్దరి మధ్య భేదభిప్రాయాలు రావడంతో ఈ మూవీ మళ్లీ ఆగిపోయింది. అనంతరం అమీర్ ఖాన్, అజిత్ వద్దకు కూడా ఈ కథ వెళ్ళింది. అయితే వారితో మూవీ సెట్ అవలేదు. అలా చివరికి రజనీకాంత్ దగ్గరకు వెళ్ళింది. అయితే శంకర్ ఈ మూవీలో రజినీకాంత్ ని విలన్ గా అనుకున్నాడు. హీరో షారుక్ అని భావించాడు. అయితే స్టోరీ విషయంలో షారుక్ ఒప్పుకోలేదు. దాంతో శంకర్ రజనీకాంత్ తోనే విలన్ చిట్టి క్యారెక్టర్ మరియు హీరోగా కూడా చేయించారు. ఇక ఈ మూవీ సరికొత్తగా కథతో ఆడియెన్స్ ని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.
Also Read: లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ను గమనించారా?