మెగాస్టార్ చిరంజీవికి రీమేక్ సినిమాలు చేయవద్దని లెటర్ రాసిన మెగాఫ్యాన్..

Ads

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. చిరంజీవి అంటే ఆయన ఫ్యాన్స్ కి ప్రాణం కన్నా ఎక్కువ. మెగాస్టార్ తన ఫ్యాన్స్ ను మెప్పించే సినిమాలను చేస్తున్నారా?

Ads

తన రేంజ్ కి తగిన స్టోరీలను ఎంపిక చేసుకోవడంలో మెగాస్టార్ తడబడుతున్నారా? రీమేక్ సినిమాల  ద్వారా సేఫ్ ప్రయాణం చేయాలని భావిస్తున్నారా? అయితే వీటికి సమాధానాలు దొరకకపోవచ్చు. కానీ మెగా అభిమానులు తమ అభిమాన స్టార్ నుండి ఏం కోరుకుంటున్నారో తెలియాలి అంటే మాత్రం మెగాఫ్యాన్ చేసిన ఈ ట్వీట్ ను చదవాలి. మరి ఆ ట్వీట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
చిరంజీవి ‘ఖైదీ నెం.150’ అనే రీమేక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో ఫ్యాన్స్ కి కష్టంగా అనిపించింది. ఎందుకంటే వేరే హీరో చేసిన క్యారెక్టర్ మెగాస్టార్ చేయడం ఏమిటని అభిమానులు అభిప్రాయం దానికి కారణం వారి మనసుల్లో మెగాస్టార్ నటించిన రుద్రవీణ, చంటబ్బాయ్, చిరంజీవి, గ్యాంగ్ లీడర్ లాంటి ఎన్నో సినిమాలలో చిరంజీవి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న గొప్ప నటుడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడం లేదా అనే ప్రశ్న ఒక అభిమాని చేసిన ట్వీట్ ని చూసిన వారికి రాక మానదు. గత ఏడాది విడుదలయిన ‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాళంలో హిట్ అయిన హిట్ ‘లూసిఫర్’కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న‘భోళా శంకర్’ కూడా రీమేక్ సినిమానే. కోలీవుడ్ లో అక్కడి స్టార్ హీరో అజీత్ కుమార్ ‘వేదలం’ మూవీకి రీమేక్ గానే భోళా శంకర్ గా తీస్తున్నారు. మరి ఈ విషయం పై మెగాఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అంటే ఆనంద సంగీతమ్ అనే ఫ్యాన్ మెగాస్టార్ చిరంజీవికి రాసిన లెటర్ చదవాలి.
ఆ లెటర్ లో ఏముంది అంటే ‘‘చిరంజీవి గారు ఒక మూవీలో ఆ స్టార్ కాకుండా ఆ క్యారెక్టర్ కనిపించి నప్పుడే అది వారిలో ఉన్నఅసలైన నటన. కన్యాశుల్కంలో చిత్రంలో ఎన్టీఆర్ కాకుండా గిరీశం మాత్రమే తెర పై కనిపిస్తాడు. ఇక చంటబ్బాయిలో మూవీలో చిరంజీవి కాకుండా పాండురంగా రావు మాత్రమే తెర పై కనిపిస్తాడు. ఆ చిరంజీవి నాకు కావాలి. రుద్రవీణలోని సూర్యం, గ్యాంగ్ లీడర్ చిత్రంలోని రాజారాం కావాలి. అంతేకాని ఖైదీ నెం.150, సైరా, లూసిఫర్ లాంటివి వద్దు. తెలుగు ఆడియెన్స్ కి సినిమా అంటే పిచ్చి సార్. లూసిఫర్ చిత్రాన్ని ఎప్పుడో చూసాము. ఇక మోహన్ లాల్, పృథ్వీరాజ్ లు కూడా మనవాళ్లే. అదే కథ మళ్లీ మీతో చేస్తే ఏం చేయమంటారు.
అయినా రీమేక్ లు కాకుండా మన వద్ద స్టోరీస్ ఏమి లేవా? మీరు ‘అర్థాకలి’ అని అంటూంటారు. అయితే మీకు అసలు ఆకలి అనేది లేదు. రుద్రవీణలో సూర్యం లగా ‘నేను సైతం’ అనే నటుడు కనిపించడం లేదు. ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలకు మీరెందుకు సార్? మీ లెవెల్ ఏమిటి? మీరు నటించే సినిమాలు ఏమిటి? ఇంకా ఎన్ని రోజులు స్టోరీలు రాయడం రాని రచయితలు. మీరు కొన్ని రోజులు పస్తులు ఉండండి. చిరంజీవి అనే స్టార్ కనిపించకుండా నటించండి. అలాంటి యాక్టింగ్ ని మాకు చూడాలని ఉంది. దయచేసి తప్పుగా భావించకండి అని ట్వీట్ చేశాడు.
Also Read: హాలీవుడ్ సినిమాల పోస్టర్లను కాపీ కొట్టిన 11 తెలుగు చిత్రాలు ఇవే..

Previous articleస్టార్ డైరెక్టర్ ను బిర్యానీ తీసుకు రమ్మని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..
Next articleహీరో సుమన్ కెరీర్ ను నాశనం చేయాలనుకున్న మిత్రుడు ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.