Ads
మనం ప్రయాణం చేసేటప్పుడు సులభంగా ఉండడానికి ఆ రోడ్డు మీదుగా వెళ్తే ఏ ఊరు వస్తుంది అనేది రాళ్ల మీద రాసి ఉంటుంది. అలానే ఆ ఊరికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో మనం చేరుకోవచ్చు అనేది కూడా ఆ రాయి మీద రాసి ఉంటుంది. దీనితో సులభంగా వాహనదారులు గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.
ఈ రాలనే మైల్ స్టోన్స్ అని అంటారు. అయితే మరి అన్ని మైల్ స్టోన్స్ మీద ఓకే రంగుని వాడరు. వివిధ రకాల రంగుల్ని మైల్ స్టోన్స్ మీద వాడుతారు.
కొన్ని మైల్ స్టోన్స్ తెలుపు రంగులో.. కొన్ని మైల్ స్టోన్స్ పసుపురంగులో.. ఆకుపచ్చ రంగులో కొన్ని ఇలా వివిధ రకాల రంగుల్ని ఈ రాళ్ళ మీద ఉపయోగిస్తారు. ఎక్కువగా మనకి తెలుపు రంగు మైల్ స్టోన్స్ కనబడుతూ ఉంటాయి. నిజానికి సగానికి పైగా మైల్ స్టోన్స్ తెలుపు రంగులోనే ఉంటాయి. కింద మొత్తం తెలుపు రంగు పైన మరొక రంగుని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అసలు ఈ రంగులకు ఏమైనా అర్థం ఉందా..?
Ads
లేదు అంటే మామూలుగానే ఎవరికి నచ్చిన రంగు రంగులను వాళ్ళు వాడతారా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీలో కూడా ఈ సందేహం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ఈ రాళ్ల మీద తెలుపు రంగు తో పాటు వేరే రంగులు కూడా ఉపయోగిస్తుంటారు. ఒకవేళ కనుక మీరు ఉండే ప్రదేశం లో మైల్ స్టోన్ పసుపు రంగులో ఉంటే అది నేషనల్ హైవే.
అదే ఒకవేళ ఆకుపచ్చరంగులో ఉంటే అది స్టేట్ హైవే. నలుపు రంగు, నీలం రంగు లేదా తెలుపు రంగు కనుక ఉంటే మీరు ఒక సిటీ లేదా డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయ్యారని అది సూచిస్తుంది. పైగా ఆ రోడ్ల మెయింటినెన్స్ జిల్లా పరిధి లోకి వస్తుంది. లేదా ఆ రోడ్ల మెయింటెనెన్స్ ని సేమ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది అని తెలుపుతుంది. ఎరుపు రంగులో కనుక ఉంటే అది రూరల్ రోడ్డు అని అర్థం. అంటే ఇది ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కిందికి వస్తుంది.