“ఈసారి హిట్ కొట్టాలి అన్నా..!” అంటూ… కల్కి 2898 ఏడి రిలీజ్ సందర్భంగా ప్రభాస్ కి ఒక అభిమాని ఎమోషనల్ లెటర్..!

Ads

ప్రియమైన ప్రభాస్ అన్నకి,

నీ అభిమాని అన్నా నేను. రెండు రోజుల నుండి నిద్ర పట్టట్లేదు. సినిమా ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూనే ఉన్నాను. బాహుబలి తర్వాత నువ్వంటే ఏంటో భారతదేశం అంతా తెలిసిపోయింది అన్నా. బాలీవుడ్ వాళ్లు, వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ ఫేవరెట్ హీరో నువ్వు అని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆ సినిమా తర్వాత నువ్వు ఎలాంటి సినిమా చేస్తావు అని ఎదురు చూసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. సాహో సినిమా నాకు నచ్చింది. కానీ చాలా మంది సినిమా చూసి అంచనాలని అందుకోలేదు అన్నారు.

venu swamy about prabhas

తర్వాత వచ్చే సినిమాలు బాగుంటాయి అని ఒక నమ్మకంతో ఉన్నాం. తర్వాత వచ్చిన రాధే శ్యామ్ కూడా బాగుంది. మొన్న వచ్చిన సలార్ కూడా బాగుంది. కానీ నీ నుండి ఇంకా ఏదో ఆశిస్తున్నారు. కానీ నీ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. కాబట్టి, నీ నుండి అందరూ అలాంటి సినిమాలే ఆశిస్తున్నారు. నువ్వు సినిమా తీస్తే బాహుబలి అంత హై రేంజ్ సినిమా ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. నీ మీద అందరికీ ఉన్న అభిమానం అలాంటిది అన్నా. కానీ ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఒదిగి ఉంటావు. అందరినీ నా అనుకుంటావు. నీలో నాకు నచ్చేది అదే అన్నా.

Ads

నీ సినిమాలతో పాటు, నీ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కి కూడా అభిమానిని అయిపోయాను. నువ్వు ప్రతి సినిమాకి ఎంత కష్టపడుతున్నావో అందరికీ తెలుస్తోంది. అందుకే నీ మీద అందరికీ రోజురోజుకీ అభిమానం పెరుగుతోంది. బాహుబలి తర్వాత కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేశావు. నీలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు టాలీవుడ్ కి ఒక వరం. ఇప్పుడు కల్కి సినిమా కోసం ప్రపంచం అంతా కూడా ఎదురుచూస్తోంది. ఈసారి మాత్రం డిసప్పాయింట్ చేయకు అన్నా.

నువ్వంటే ఏంటో ప్రపంచం మొత్తం తెలియాలి. ఈసారి నువ్వు హిట్ కొట్టాలి అన్నా. ఇండియా మాత్రమే కాదు. మొత్తం ప్రపంచం నీ గురించి గర్వంగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటారు కూడా. ఆ నమ్మకం మాకు ఉంది. ఈ సినిమా మాత్రమే కాదు. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమాలు కూడా నిన్ను ఇంకా పెద్ద నటుడిని చేస్తాయి. నీ అభిమానులు గర్వపడేలా చేస్తాయి. నీలాంటి హీరోకి అభిమానులుగా ఉండడం మా అదృష్టం.

ఇట్లు,

నీ వీరాభిమాని.

Previous articleతల్లి చేసే ఈ పనుల వల్ల కూతురి కాపురం నాశనం అవుతుందా..? అవేంటంటే..?
Next articleఏడంతస్తుల బిల్డింగ్ తో పాటు ఆస్తులు అమ్మకం… 250 కోట్ల అప్పు..! అసలు ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.