వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేడుకలలో కనిపించని పవన్..! కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్..!

Ads

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి గురించి అందరికీ తెలిసిందే. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరుగబోతుంది. ఈ పెళ్ళి కోసం ఇప్పటికే, మెగాఫ్యామిలీ, లావణ్య కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

సంగీత్, కాక్ టైల్ పార్టీలో వరుణ్ లావణ్యతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి,  నితిన్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎక్కడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించలేదు. దీంతో ఫన్నీ మీమ్స్, వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

Ads

ఇటలీలోని టుస్కానీ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వివాహం కోసం మెగా, లావణ్య, అల్లు, కామినేని ఫ్యామిలీలతో పాటుగా పలువురు సన్నిహితులు కూడా అక్కడకి వెళ్ళి సందడి చేస్తున్నారు. అక్టోబర్ 30 సంగీత్, కాక్ టైల్ పార్టీలు జరుగగా మెగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో హీరో నితిన్, నీరజ కోన లాంటి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
వరుణ్ లావణ్యతో పాటు ఈ పార్టీలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. నిన్న జరిగిన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు  కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వరుణ్, లావణ్య, చిరంజీవి, సురేఖ, నాగబాబు దంపతులు కనిపించారు. ఈ పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ కూడా అన్నా లెజినోవాతో కలిసి ఇటలీకి వెళ్లారు. కానీ పెళ్లి వేడుకల ఫోటోలలో పవన్ కనిపించలేదని పవన్ ఫ్యాన్స్ బాధని వ్యక్తం చేస్తున్నారు.
మెగా ఫ్యాన్స్ చర్చలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ఫన్నీ మీమ్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు. కొందరు అభిమానులు పవన్ ఎక్కడ ఉన్నాడో పట్టుకుని కొన్ని ఫొటోలు దిగమను బాస్ అంటూ చిరంజీవిని కోరుతున్నారు. కొందరేమో సైలెంట్ గా రూంలో ఉండేదానికి ఇటలీ వరకు వెళ్ళాలా అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “మ్యాన్షన్ 24” లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?

 

Previous article“మ్యాన్షన్ 24” లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?
Next articleబిగ్ బాస్‌లో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.