Ads
చాలా మంది రైతులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. అన్నాన్ని పండించి మన కడుపును నింపే రైతులు అంత దీన స్థితిలో ఉండడం నిజంగా బాధాకరం. కానీ నిజానికి రైతులకు విలువ ఇవ్వాలి. కానీ వాళ్ళని చూస్తే గౌరవం కూడా చాలా మంది ఇవ్వరు. అది చాలా తప్పు. రైతును చూడగానే ఎంతో చులకనగా చూస్తారు. అతని వస్త్రధారణని చూసి కొందరయితే ఎంతో చీప్ గా చూస్తారు. అయితే ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు.
పొలాన్ని సాగు చేసుకుని ఉన్నంతలో బాగానే సంపాదిస్తున్నాడు. తనకి ఒక కుమార్తె ఉంది. పెళ్లి ఈడు వచ్చాక ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపించాడు. తాను మాత్రం వ్యవసాయమే చేస్తున్నాడు. కూతురు పట్నం లో ఉంటుంది.
Ads
ఓ నాడు కూతుర్ని చూడడానికి రైతు పట్టణం వచ్చాడు. కూతుర్ని చూసి తిరిగి ప్రయాణం అయ్యే సరికి ఆలస్యం అయింది. రైల్వే స్టేషన్ కి వచ్చి ఒక పక్క ఫైవ్ స్టార్ హోటల్ ఉంటే అక్కడికి వెళ్లి భోజనం చేయాలని అనుకున్నాడు. హోటల్ కి వెళ్ళగానే అతని పంచి కట్టు చూసి అక్కడున్న వాళ్ళందరూ కాస్త వింతగా చూడటం మొదలుపెట్టారు. వెయిటర్లు ఈ విషయాన్ని మేనేజర్ కి చెప్పగా మేనేజర్ వచ్చి నీ వద్ద డబ్బులు ఉన్నాయా..? అని అడిగాడు ఇది చాలా పెద్ద హోటల్.
బయట చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళమన్నాడు. రైతు హేళన చేస్తున్నారని తెలుసుకుని తన దగ్గర ఉన్న డబ్బులు టేబుల్ మీద పెట్టాడు. ఏం కావాలో చూడమని వెయిటర్లకి చెప్పాడు మేనేజర్. ఖరీదైన ఆహారాన్ని తెప్పించుకుని శుభ్రంగా తిని టిప్ గా 2000 ఇచ్చాడు. ఎప్పుడూ కూడా ఎవరిని చూసి తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి ఉండేది వాళ్లకి ఉంటుంది. ఎదుటి వాళ్ళని చీప్ గా చూడడం అసహ్యించుకోవడం తప్పు.