ప్రభాస్ రాజాసాబ్ సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా…?

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా హిట్ ఇచ్చిన ఊపుతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా నాగలక్ష్మి డైరెక్షన్లో నటిస్తున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇది కాకుండా ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇది ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.

Ads

అయితే రాజా సాబ్ సినిమా కథని మారుతి ముందు వేరే హీరో వద్దకు తీసుకు వెళ్లారట. అయితే ఆ హీరో ఈ కథను సునీతంగా రిజెక్ట్ చేసినట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పుడు రాజా సబ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు ఉంటూ ఆరాల తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. నానితో ఇంతకుముందు మారుతి భలే భలే మగాడివోయ్ సినిమా తీశారు అది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

అయితే నాని రిజెక్ట్ చేసిన తర్వాత ఇదే కథను పలువురు హీరోలకి చెప్పగా వాళ్ళు కూడా రిజెక్ట్ చేసారట. అయితే తర్వాత మారుతి పలుమార్పులు చేర్పులు చేసి ప్రభాస్ కు ఈ కథను వినిపించారట. వెంటనే ప్రభాస్ కథను ఓకే చేయడం షూటింగ్ స్టార్ట్ అవడం జరిగింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

Previous articleసెలబ్రిటీస్ కి ఇచ్చిన అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉందంటే..?
Next articleఈమె కన్నా వయసు ఎక్కువ ఉన్నవారికి అవకాశాలు ఇస్తున్నారు.. కానీ ఈ 32 ఏళ్ల హీరోయిన్ కి ఎందుకు ఇవ్వటం లేదు..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.