పిల్లలు ఎట్టి పరిస్థితిలో ఫోన్ ముట్టుకోకుండా ఉండాలంటే.. ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి..!

Ads

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. పెద్దలు పిల్లలు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్ బాగా అలవాటు అయిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మీ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారా..? వాళ్ళు ఫోన్ ముట్టుకోకుండా ఉండాలంటే మీరు ఇలా చేయండి.. అప్పుడు కచ్చితంగా వాళ్ళు ఫోన్ ముట్టుకోకుండా ఉంటారు.

చాలామంది పిల్లలు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోవడంతో తల్లిదండ్రులకు ఇది పెద్ద సమస్యగా మారింది. ఫోన్ అలవాటు తప్పించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు ఫోన్ కి కనుక పిల్లలు బాగా అలవాటు పడిపోయినా టీవీకి బాగా అలవాటు పడిపోయినా కంటి సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఇలా కనుక మీరు చేశారంటే ఇంకెప్పుడూ మీ పిల్లలు ఫోన్ ని ముట్టుకోరు.

Ads

రెండు సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి మాత్రం అస్సలు ఫోన్ ఇవ్వకూడదు. పైగా ఫోన్ ఇచ్చారంటే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉండేది అయ్యి ఉండాలి. అప్పుడే పిల్లలకి ఫోన్ ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి. ఎడ్యుకేషన్ పరంగా అవగాహన కల్పించడానికి మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ పిల్లలైనా సరే వాళ్ళ యొక్క తల్లిదండ్రులని చూసి అన్ని విషయాలని నేర్చుకుంటారు.

తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతుంటారు. సో ముందు తల్లిదండ్రులు ఫోన్ వాడకం తగ్గించాలి. ఎక్కువ శాతం మంది పిల్లలు వాళ్ళని చూసే అనుసరిస్తారు కాబట్టి మొబైల్ ఫోన్ వాడకాన్ని తల్లిదండ్రులు తగ్గించాలి. భోజనం చేసే ముందు నిద్రించే గదిలో మొబైల్ ఫోన్ వాడడం మానుకోండి. పిల్లలకి డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్, గ్రూప్ గేమ్స్, పజిల్ గేమ్స్ ఇలాంటివి నేర్పించడం వంటివి చేస్తే మొబైల్ ఫోన్ నుండి డైవర్ట్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఇలా చేయడం మంచిది.

Previous articleవారానికి ఒక్కసారి ఇలా నడిస్తే ఎన్నో లాభాలు.. ఏయే మార్పులు వస్తాయి అంటే..?
Next articleఈ 4 విషయాలని ఎంత మంచి భర్య అయినా కూడా.. భర్త తో చెప్పదు..!