Ads
నాచురల్ స్టార్ నాని హీరోగా వినూత్నమైన కాన్సెప్ట్ తో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. అమాయకమైన ఐదుగురు ఆడవాళ్లు.. జీవితంలో తాము మోసపోవడానికి కారణమైనటువంటి వ్యక్తిపై ఎలా పగ సాధిస్తారో అనే కాన్సెప్ట్ తో వినోదాన్ని జోడించి ఎమోషన్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మదికి దగ్గర చేశాడు డైరెక్టర్.
ఈ మూవీలో నానితో పాటు…ఆ ఐదుగురు కలిసి వీళ్ళని ఒక ఆట ఆడిస్తారు. ఆ ఐదు మందిలో ఉన్న ఒక పాప శ్రియా రెడ్డి. సినిమాలో అయితే నటించింది కానీ మూవీ కంప్లీట్ అయ్యాక ఆ పాప చిత్రానికి సంబంధించిన ఏ ప్రమోషన్ ఈవెంట్లో కనిపించలేదు. కారణం ఏమిటి అంటే షూటింగ్ పూర్తయిన వెంటనే ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా పోస్ట్ బోస్టన్‌కు వెళ్లడమే. అక్కడ శ్రియ రెడ్డి తన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
Ads
ఈ మూవీలో శ్రియ రెడ్డి నటించిన పాత్ర పేరు స్వాతి. ఈ చిత్రంలో తన అన్నను కోల్పోయిన ఒకటి టీనేజర్ గా ఆమె నటన మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. అయితే తను సినిమాల్లో ఎలా నటించింది అనే విషయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి వెల్లడించడం జరిగింది. తను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి థియేటర్లో నటించిందట.
అప్పట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కి వెళ్లి శ్రియా రెడ్డి.. ఇంటర్ సెకండియర్ లో ఉన్నప్పుడు శేఖర్ కమల చిత్రం కోసం ఆడిషన్ కి కూడా వెళ్ళింది. అయితే ఆ సందర్భంలో ఆమెను అక్కడ చూసిన ఒక సైడ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ విక్రమ్ కుమార్ కు ఆమె ఫోటోలు పంపగా తనని పిలిచి సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం శ్రియ లేటెస్ట్ పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.