Ads
వన్డే ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదు అయ్యింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ పై ఆస్ట్రేలియా గెలుపు సాధించింది. ఇది కొత్తేమీ కాదు. కానీ ఆస్ట్రేలియా గెలిచిన విధానం అద్భుతం. చరిత్రలో నిలిచిపోయే ఆట ఆడిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, డబుల్ సెంచరీ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు.
Ads
గాయం బాధిస్తున్నా, నొప్పిని భరిస్తూ, పోరాడి ఆస్ట్రేలియా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలిచాడు. అయితే మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ తరువాత అతని భార్య చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వన్డే క్రికెట్ హిస్టరీలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్, ఓడిపోయిందని భావించిన మ్యాచ్ ను ఒంటి చేత్తో స్కోర్ మొత్తం తానే చేసి, ఆఫ్ఘన్ పై అద్భుత విజయం సాధించి, ఆస్ట్రేలియాను సెమీస్‌కు తీసుకెళ్ళాడు. 5 సార్లు విజేత అయిన తన ఆస్ట్రేలియాను ఘోర పరాభవం నుండి తప్పించి, జట్టును గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 291 పరుగుల చేసి, ఆస్ట్రేలియా ముందు 292 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా, మొదటి నుంచే తడబడింది. అఫ్గానిస్థాన్ బౌలర్ల ధాటికి తేలిపోయింది. రెండవ ఓవర్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను బౌలర్ నవీన్ ఉల్ హక్ డకౌట్ చేశాడు. 49 పరుగులకే 5 వికెట్లు పోగొట్టుకుంది.
ఆ తరువాత బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ, డబుల్ సెంచరీతో ఆఫ్ఘన్ పై 3 వికెట్ల తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ హాజరైన మాక్స్‌వెల్ భార్య విని రామన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో “ఆల్ ద ఎమోషన్స్ 201” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. భారతీయ సంతతికి చెందిన విని రామన్, గత ఏడాది గ్లెన్ మాక్స్‌వెల్ ను వివాహం చేసుకున్నారు.
Also Read: ఇంగ్లాండ్, పాక్, శ్రీలంకల పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాల వెనుక ఉన్న ఇండియన్ ఎవరో తెలుసా.?