Ads
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సలార్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. హైఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు పార్ట్స్ రూపొందుతోంది.
Ads
తొలి భాగం సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ తో ప్రభాస్ సుమారు 6 సంవత్సరాల తర్వాత సాలిడ్ విజయం పొందారు. సలార్ మూవీలో డైలాగ్స్, ఫైట్స్ ఆడియెన్స్ చాలా ఆకట్టుకున్నాయి. అందులో కాటేరమ్మ ఫైట్ హైలెట్ గా నిలిచింది. అయితే ఆ మూవీలో చెప్పిన కాటేరమ్మ దేవత కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాహుబలి సినిమాల తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాలు అంతగా ఆడలేదు. ఫ్యాన్స్ నిరాశపరించాయి. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహా ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ మూవీలోని హైలైట్స్ లో ముందు ఉండేది కాటేరమ్మ ఫైట్. ”కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ” అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
అయితే ఈ మూవీలో చూపించిన కాటేరమ్మ దేవత గురించి ఎక్కువ మందికి తెలియదు. తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, కర్ణాటక రాష్ట్రంలో కాటేరమ్మగా పూజిస్తున్నారు. పార్వతి దేవి పరమ శివుడు కైలాసంలో నిద్రపోయే సమయంలో నిత్యం రాత్రి పూట ఎక్కడికో వెళ్ళి సూర్యోదయానికి ముందే కైలాసానికి వచ్చేదట. అయితే ఈ విషయాన్ని గమనించిన పరమేశ్వరుడు పార్వతీ దేవిని అడిగాడట. అప్పుడు పార్వతి తనకు తెలియకుండానే ఇలా అవుతోందని శివుడికి చెప్పిందట. దాంతో శివుడు ఒకనాడు పార్వతీదేవి వెళ్తుండగా ఆమెను అనుసరించాడట. పార్వతీదేవి అడవుల గుండా వెళ్తూ ఉందంట.
హఠాత్తుగా కాళికా రూపంలోకి మారిన పార్వతీదేవి పూడ్చిపెట్టిన శవాలని వెలుపలికి తీసి తినడానికి ప్రయత్నిస్తుండగా శివుడు ఉగ్ర రూపంలోకి మారిపోయాడట. ఆ తరువాత పార్వతిని ఆపడం కోసం ఆమె నడిచే దారిలో పెద్ద గొయ్యిని క్రియేట్ చేసాడట. ఆ దారి గుండా వెళ్ళిన పార్వతి ఆ గొయ్యిలో పడిపోయిందంట. ఆ తరువాత జరిగినది తెలుసుకున్న పార్వతి పశ్చాత్తాపం పడి, కాళికా రూపం వదిలి పార్వతీదేవిగా మారి పరమేశ్వరుడితో వెళ్లిపోతుందట. అలా పార్వతి దేవి వదిలిన ఆ ఉగ్రరూపంను కాటేరమ్మ దేవత అని పిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో కాపలా దేవతగా, కొన్ని చోట్ల కులదేవతగా కాటేరమ్మను కొలుస్తుంటారు.
Also Read: ఐదుగురు పాండవులతో ద్రౌపది ఎలా కాపురం చేసేదో తెలుసా..? వాళ్ళు పెట్టుకున్న నియమం ఏంటంటే.?