గుంటూరు కారం సెన్సార్ లో కట్ చేయమని చెప్పిన 2 సీన్స్ ఏవో తెలుసా..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇవాళ ఈ సినిమా ఈవెంట్ గుంటూరులో జరుగుతోంది. దాని కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గతవారం జరగాల్సిన ఈవెంట్ వాయిదా పడి ఇవాళ జరుగుతోంది.

సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక మదర్ సెంటిమెంట్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో ఎంతో మంది ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి. ఇంకొక పాట కూడా విడుదల అవ్వాల్సి ఉంది.

Ads

సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి అయ్యింది. ఈ సినిమాకి సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాకి రెండు కట్స్ కూడా ఇచ్చింది. ఈ సినిమాలో రెండు పదాలని మ్యూట్ చేయాలి అని సెన్సార్ బృందం ఆదేశాలు జారీ చేసింది. అందులో ఒకటి దసరాలో కూడా మ్యూట్ చేసిన బె-న్-చ-త్ అనే పదం అయితే, మరొకటి పీస్ అనే పదం. ఈ సినిమాలో ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి పాట రిఫరెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ పాటలో భూమిక హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో కూడా భూమిక గురించి ప్రస్తావన వస్తూ పీస్ అని ఆమెని అంటారు అని సెన్సార్ రిపోర్ట్ లో రాసి ఉంది.

guntur kaaram censor cuts

కాబట్టి ఆ పీస్ అనే పదాన్ని మ్యూట్ చేయాలి అని సెన్సార్ బృందం ఒక కట్ చెప్పింది. మిగిలిన ఏ విషయాలకి కూడా ఈ సినిమాలో కట్స్ కానీ మ్యూట్స్ కానీ లేవు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలోనే సాగుతుంది. అందులో కొంత యాక్షన్ యాడ్ చేశారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం ప్రిపరేషన్ మొదలు పెడతారు. ఈ సినిమా కోసం కొంత మంది హాలీవుడ్ నటులని, టెక్నీషియన్లని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.

Previous articleయష్ మొదలు మృణాల్ ఠాకూర్ వరకు.. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన 10 మంది నటులు వీళ్ళే..!
Next articleకొడుకు వాచ్ మెన్ మీద అరవడంతో… ముఖేష్ అంబానీ ఏం చేశారో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!