ఇదేంటి..? గుంటూరు కారం స్టోరీ ఈ సీరియల్ నుండి కాపీ కొట్టారా..?

Ads

ఈ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాలో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేష్ బాబు అభిమానులు.

త్రివిక్రమ్ కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ ఇస్తాడని నమ్మకంతో ఉన్నారు. అయితే ముందు నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సినిమా నుండి విడుదలయ్యే ప్రమోషనల్ కంటెంట్ సాటిస్ఫై చేయలేక పోతుంది.

guntur kaaram story copied from this serial

తమన్ అందించిన పాటలు నచ్చలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్ సృష్టించారు. అయితే తాజాగా గుంటూరు కారం ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు ఎన్నడూ లేనంత విధంగా ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా కనబడ్డారు. మహేష్ డాన్సులు డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా కథ యుద్ధనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల ఆధారంగా తెరకెక్కుతుందని రూమర్ కూడా వచ్చింది కానీ దానిపైన మేకర్స్ ఎటువంటి సమాధానం చెప్పలేదు.

Ads

changes in guntur kaaram

తాజాగా నిన్న గుంటూరులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో గుంటూరు కారం మూవీని ఒక సీరియల్ తో కంపేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గుంటూరు కారం సినిమాలో మదర్ సెంటిమెంట్ ని ఎక్కువగా చూపించారు. అయితే స్టార్ మా లో వచ్చే గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమో కూడా గుంటూరు కారం ట్రైలర్ కి దగ్గరగా ఉంది. దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. త్రివిక్రమ్ కొంపతీసి సీరియల్ కాపీ చేసి గుంటూరు కారం సినిమా చేయట్లేదు కదా ట్రోల్స్ చేస్తున్నారు.

watch video :

Previous articleఇలా దూకేసింది ఏంటి..? అసలు లాజిక్ లేకుండా ఇలాంటి సీన్ ఎలా తీశారు..?
Next article“మర్చిపోవడానికి అది జ్ఞాపకం కాదు… గునపం..!” అంటూ… పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అవ్వడంపై 10 మీమ్స్..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.