Ads
రోజుకి కొత్త మలుపులతో ముందుకు వెళుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. మొదట ఒకరకంగా సీరియల్ మొదలు అయ్యింది. కానీ తర్వాత ఏటో వెళ్లిపోయింది. మధ్యలో రిషి పాత్ర కనిపించకపోవడం అనేది సీరియల్ టిఆర్పి తగ్గడానికి కారణంగా మారింది. ఇప్పుడు రిషి పాత్ర మళ్లీ సీరియల్ లోకి వస్తున్నట్టు ఒక ప్రోమో విడుదల చేశారు. ఒక ఆటో డ్రైవర్ పాత్రలో రిషి కనిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు వసుధార తీసుకున్న మరొక నిర్ణయం అందరిని ఆలోచించేలాగా చేసింది. ఇవాల్టి ఎపిసోడ్ లో ఇది జరుగుతుంది. వసుధార బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయమని అడుగుతుంది.
మను అసలు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వసుధార, “సమాధానాలు అన్ని కూడా మీటింగ్ లోనే దొరుకుతాయి: అని చెప్తుంది. మీటింగ్ కి వెళ్లి, ఆలస్యం అయినందుకు క్షమించమని అడిగి, రిషి సర్ కి తన నిర్ణయం చెప్పి వచ్చాను అని చెప్తుంది. మంత్రితో, నిన్న తప్పుగా మాట్లాడినందుకు సారీ అని చెప్తుంది. అప్పుడు మంత్రి, “పర్వాలేదమ్మా. అసలు బోర్డు మీటింగ్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటి?” అని అడుగుతాడు.
Ads
అప్పుడు వసుధార, తనకి కాలేజ్ అమ్మ తర్వాత అమ్మ లాంటిది అని చెప్తుంది. అమ్మ తనకి జన్మనిస్తే, డీబీఎస్‌టీ కాలేజ్ తనకి పునర్జన్మ ఇచ్చింది అని చెప్తుంది. అలాంటి కాలేజ్ కి తాను దూరం అవుతున్నట్టు చెప్తుంది. ఫణీంద్ర, వసుధార మాట్లాడేది అర్థం కాక, “ఏం మాట్లాడుతున్నావమ్మా?” అని అడుగుతాడు. అప్పుడు వసుధార, తను ఎండి పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టు చెప్తుంది. రిసిగ్నేషన్ లెటర్ కూడా అందిస్తుంది. ఎవరు ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా వసుధార వినదు.
అప్పుడు మంత్రి, “ఇప్పుడు నువ్వు ఎండి గా ఉండాలి అంటే మేము ఏం చేయాలి? మా నిర్ణయాలు ఏమైనా మార్చుకోవాలా?” అని అడుగుతాడు. అందుకు వసుధార, “రిషి సార్ బతికే ఉన్నారు అని మీరు నమ్ముతారా?” అని అడుగుతుంది. అప్పుడు శైలేంద్ర, “అలా ఎలా నమ్ముతాం. అయినా మేము నమ్మితే అతను బతికి వస్తాడా. బోర్డు మెంబర్స్ అందరినీ కూడా మీరు బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది” అని అంటాడు.
అప్పుడు వసుధార, ఇదంతా తనకి సంబంధం లేని విషయం అని, ఎండి ఎవరో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది. అయితే రిషి పాత్ర ఎప్పుడు వస్తాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రిషి పాత్ర ఎంట్రీ అయ్యాక సీరియల్ రేటింగ్స్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన ప్రోమోకి మంచి స్పందన లభించింది. ఈసారి మేకర్స్ ఒక కొత్త ట్రాక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ ట్రాక్ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.