మీరు బాధపడొద్దు… మమ్మల్ని బాధ పెట్టొద్దు… “గుప్పెడంత మనసు” సీరియల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! విషయం ఏంటంటే..?

Ads

టీవీ సీరియల్స్ లో ప్రస్తుతం రారాజుగా వెలుగుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ప్రేక్షకులు సీరియల్ కోసం ఊపిరి బిగబెట్టి మరీ వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ ప్రేక్షకులని అంతలా కట్టిపడేసిందంటే అందులో కధా బలం అలాంటిది.

ఇందులో రిషిధారల రిలేషన్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళ లవ్ అండ్ రిలేషన్ ని వాళ్లకంటే ప్రేక్షకులు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు.

guppendantha manasu latest update

అలాంటి చక్కని ప్రేమ జంటకి ఈ మధ్య ఎడబాటు ఎదురయింది గత కొన్ని వారాలుగా రిషి కనిపించడం లేదు. దీని మీద చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. సాక్షి మాయం చేసిందా లేక శైలేంద్ర కిడ్నాప్ చేశాడా లేదంటే మరో కొత్త విలన్ ప్రవేశించబోతున్నాడా, లేదంటే జ్యోతి రాయ్ లాగా సినిమాలు మీద దృష్టి పెట్టడం కోసం సీరియల్స్ ని అవాయిడ్ చేస్తున్నాడా అంటూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కథలు అల్లుకోవడం మొదలుపెట్టారు.

వీటి మీద సోషల్ మీడియాలో అనేక కథనాలు కూడా వస్తున్నాయి. అయితే వీటిపై సీనియర్ నటుడు, సీరియల్ లో మహేంద్ర పాత్ర పోషిస్తున్న సాయికిరణ్ స్పందించారు. మీరు బాధపడకండి, మమ్మల్ని బాధ పెట్టకండి రిషి త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ముఖేష్ కి బలమైన గాయాలు తగిలాయి, గాయం తీవ్రంగా ఉండటంతో ఎంఆర్ఐ స్కాన్ చేసిన డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో రిషికి షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి వచ్చింది.

త్వరలోనే మళ్లీ మనతో రిషి జాయిన్ అవుతారు అని మహేంద్ర స్పందించడంతో రిషి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజంగానే రిషి ఆ సీరియల్ లో లేకపోతే ఆత్మ లేని శరీరంలో ఉంటుంది ఆ సీరియల్. మరి రిషి ఎప్పుడు వస్తాడో, కథలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాడో వేచి చూడాల్సిందే.

Previous articleదూత సిరీస్ కి హైలైట్ అయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
Next article“ప్రభాస్” తో పాటు… “సలార్” నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.