Ads
సలార్, గోట్ లైఫ్ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్ మలయాళంలో ఇటీవల ఒక సినిమా చేశారు. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు గురువాయూర్ అంబలనాడయిల్. మలయాళంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ తో పాటు బేసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. జయ జయ జయ జయహే సినిమాతో గుర్తింపు సాధించిన విపిన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
Ads
ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆనందన్ (పృథ్వీరాజ్), తన భార్య పార్వతి (నిఖిలా విమల్) తో తాత్కాలికంగా విడిపోతాడు. మరొక పక్క, విను (బేసిల్ జోసెఫ్) దుబాయ్ లో పని చేస్తూ ఉంటాడు. వినుకి అంజలి (అనస్వర రాజన్) తో ఎంగేజ్మెంట్ అవుతుంది. అయితే, విను ఐదు సంవత్సరాల ముందు పార్వతి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేకపోతాడు. ఆనందన్ సహాయంతో, విను ఆ బాధలో నుండి బయటకు వస్తాడు. కానీ, ఆనందన్ వైవాహిక జీవితంలో ఆనందంగా లేడు అని విను అర్థం చేసుకుంటాడు.
దాంతో, తాను అన్నలాగా భావించే ఆనందన్ ని తన భార్యతో మళ్లీ కలపాలి అని అనుకుంటాడు. కానీ తర్వాత చూస్తే, విను ప్రేమించిన పార్వతి, ఆనందన్ పెళ్లి చేసుకున్న పార్వతి ఒకరే అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కామెడీ చాలా బాగా రాసుకున్నారు. అంతే బాగా నటీనటులు తెర మీద ఆ కామెడీని చూపించారు కూడా. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సినిమా దాదాపు 85 కోట్లు వసూలు చేసింది. అంటే సినిమా ఎంత బాగా అందరికీ నచ్చిందో ఇది చూసి అర్థం చేసుకోవాలి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు పేర్లు మార్చి, డైలాగ్స్ కూడా బాగా రాశారు.