అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజు రికార్డు సృష్టించిన “హనుమాన్”.. కలెక్షన్స్ మాములుగా లేవుగా.! ఎంతంటే.?

Ads

నిన్న దేశమంతా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సందడితో మునిగిపోయింది. ఒకపక్క జై శ్రీరామ్ నినాదం మారుమోగితే మరోపక్క హనుమాన్ మూవీ కలెక్షన్లతో సునామీ సృష్టించింది. రిలీజ్ అయ్యి 10 రోజులవుతున్న కూడా హనుమాన్ మూవీ సందడి ఎక్కడా తగ్గలేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు కలెక్షన్ సాధించింది. 2024 లో 200 కోట్లు కలెక్షన్ సాధించడం మొదటి భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 200 కోట్లు మార్కులు చేరుకున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

scenes in hanuman movie

70 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం సాధించి ఇప్పటికీ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో నిర్మాతలకు 70 కోట్ల పైగానే లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలో ఇదే సంచలనం కొనసాగిస్తే 100 కోట్లు లాభాల దిశగా హనుమాన్ మూవీ సాగిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నిర్మాతలకు ఈ రేంజ్ లో లాభాలు తెచ్చి పెట్టిన మూవీ ఈలోగ రాలేదు. నైజాంలో కూడా ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.

Ads

ఇక టికెట్ పైన ఐదు రూపాయలు రామ మందిరానికి ఇస్తామని ప్రకటించిన హనుమాన్ టీం ఆ మాటను కూడా నిలబెట్టుకుంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా రామచంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఒక టిక్కెట్ కంటే ఒక టిక్కెట్ ఫ్రీ ఇచ్చి ఆఫర్ ను కూడా పెట్టారు.

ఉత్తర భారత దేశంలో అక్కడ అభిమానులు హనుమాన్ మూవీకి పట్టం కడుతున్నారు నిర్మాణంతో ఆనందంలో ఉన్న ప్రజలు మరోపక్క హనుమాన్ మూవీ కి వెళ్లి ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఇప్పుడు హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ కోసం భారతదేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తుంది. ఈ సినిమాని రామ మందిరం ప్రారంభోత్సవ రోజు ప్రశాంత వర్మ ప్రారంభించారు.

Previous articleఅయోధ్య రామ మందిరం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం ఏమిటో తెలుసా..?
Next articleAYODHYA: ఆహ్వానం అందినా కూడా ఎన్టీఆర్, ప్రభాస్ లు అయోధ్యకు ఎందుకు వెళ్ళలేదు.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.