హీరో శర్వానంద్ వివాహం చేసుకోబోయే రక్షిత రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Ads

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న హీరో శర్వానంద్ తాజాగా బ్యాచిలర్ జీవితానికి వీడ్కోలు చెప్తూ రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఒక స్టార్ హోటల్లో ఇరు కుటుంబ సభ్యులతో పాటుగా, టాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రెటీలు మధ్య చాలా వైభవంగా జరిగింది.

Ads

హీరో శర్వానంద్ వివాహం చేసుకోబోయే రక్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో చేస్తుంది. ఇక వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం అని తెలుస్తోంది. రక్షిత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి. టిడిపి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి. ఆమె వెనుక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం. రక్షితకు తండ్రి నుండి వచ్చే ఆస్తులే కాకుండా ఆమె తాతల కాలం నుండి వచ్చే ఆస్తులు కూడా ఆమె పేరు మీద ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న రక్షిత రెడ్డి మెడలో శర్వానంద్ తాళి కట్టబోతున్నాడు.
అయితే శర్వానంద్ కి ఆస్తులు లేవని కాదు. ఆయన వెనుక చాలా ఆస్తులున్నాయి. అంతేకాక శర్వానంద్ తనకు 17 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండి ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం లేదంట. ఇక ఈమధ్య ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలను తానే నిర్మించుకునే కెపాసిటీ ఉందని తెలిపారు. ఇక రక్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తూ ఆస్తులు భారీగానే సంపాదించారని తెలుస్తోంది.శర్వానంద్ పెళ్లి ఆలస్యంగా చేసుకుంటున్నా కూడా ఆయనకి తగ్గ సంబంధమే కుదిరిందని చెప్పవచ్చు. వీరి వివాహ తేదీని ఇరు కుటుంబాల వారు కలిసి త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సమ్మర్ లో శర్వానంద్, రక్షిత రెడ్డిల పెళ్లి జరగనుందని సమాచారం.

Also Read: లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి అర్జున్ దాస్ సినిమాలలో నటిస్తున్నాడా?

Previous articleవెంక‌టేశ్వ‌ర స్వామి హస్తాలలో రెండు కింద‌కు ఎందుకు చూపిస్తాయో తెలుసా?
Next articleవీసా లేకుండా ఈ 10 కంట్రీస్ కి వెళ్లొచ్చు.. మరి ఆ దేశాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.