Ads
మనలో అందరం కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ట్రైన్ లో ప్రయాణించే ఉంటాం. ప్యాసింజర్ ట్రైన్ దగ్గర నుంచి గూడ్స్ ట్రైన్ వరకు పలు రకాల ట్రైన్స్ మనకు బాగా తెలుసు. ప్రతి ట్రైన్ బోగి కి రెండు వైపులా తలుపులు మరియు పాసింజర్ కూర్చొని ప్రతి సీట్ల దగ్గర అటు ఇటు కిటికీలు ఉంటాయి. మామూలు కోచులకైతే ఓపెన్ లో ఉండే ఈ కిటికీలు ఏసీ కోచ్ లోకి మాత్రం గ్లాస్ తో క్లోజ్డ్ గా ఉంటాయి.
మనలో చాలామందికి ఈ ట్రైన్ కిటికీ దగ్గర కూర్చుని వెనకకు వెళ్తున్న ప్రపంచాన్ని చూడడం ఎంతో ఇష్టం. అయితే భోగి కి అసలు కిటికీలు లేని ట్రైన్ ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇండియన్ రైల్వే నడిపే ఒక ట్రైన్ కి తలుపులు కిటికీలు లాంటివి అస్సలు ఉండవు. ఇంతకీ ఆ ట్రైన్ ఏది అని ఆలోచిస్తున్నారా.. అయితే ఆ ట్రైన్ గురించి తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వేస్ నడిపే కొన్ని రైళ్ల భోగి లకు ఎటువంటి తలుపులు , కిటికీలు పెట్టరు. ఇటువంటి ట్రైన్స్‌ని ఎన్ఎంజీ ట్రైన్స్ అని పిలుస్తారు. ఎక్కువగా రైల్లో ప్రయాణించేవారు ఎక్కడో ఒకచోట ఇలాంటి ట్రైన్స్ ని గమనించే ఉంటారు. పాత ప్యాసింజర్ ట్రైన్స్ ను ఇలా ఎన్ఎంజీ రైళ్లుగా కన్వర్ట్ చేస్తారు.
అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మోడీఫైడ్ గూడ్స్ అని అనవచ్చు.
Ads
ఇటువంటి రైళ్లను ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెహికల్స్ ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. కార్లు, బైకులు మరియు ట్రాక్టర్స్ వంటి పలు రకాల వాహనాలను ఈ ఎన్ఎంజీ రైలులో సులభంగా రవాణా చేస్తారు. అందుకే వీటి భద్రత కోసం భోగి లకు ఎటువంటి తలుపులు, కిటికీలు ఉంచరు. ఒక ప్యాసింజర్ ను ఎన్‌ఎంజీ రైలుగా కన్వర్ట్ చేసిన తర్వాత సుమారు దాన్ని 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉపయోగిస్తారు.
ఒక ప్యాసింజర్ రైలు 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంది అంటే ఇక దానిని ప్రయాణికుల ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించారు. అలాంటి బండ్లను ఆటో కారియర్లుగా మారుస్తారు. ప్యాసింజర్ కోచ్‌ను
ఎన్ఎంజీ ట్రైన్ గా మార్చేటప్పుడు లోపల ఉన్నటువంటి సీట్లు ,లైట్లు ,ఫాన్స్ అన్ని తీసివేసి భోగిలన్నిటిని పూర్తిగా సీల్ చేస్తారు.