Ads
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించే సినిమాలకు తమిళంలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా చాలా క్రేజ్ ఉంది. అది మాత్రమే కాకుండా అజిత్ నటించే చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. ఆ సినిమాలలో హీరో అజిత్ మేకోవర్ చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది.
Ads
ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు అది కూడా మేకప్ ఉపయోగించకుండానే అలా ఉంటాడు. అజిత్ సికింద్రాబాద్ లో జన్మించాడు. దానివల్ల కూడా ఆయన పై ప్రాంతీయ అభిమానం ఉంటుంది. అజిత్ 2022 లో ‘వలీమై’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘తెగింపు'(తునివు) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
అయితే అజిత్ రియల్ లైఫ్ లో చాలా సాదాసీదాగా ఉంటాడు. అలా ఉండడానికే ఇష్టపడతాడు. ఆయన మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే అస్సలు కనిపించడు. అంతేకాకుండా తన కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతాడు.ఇక హీరో అజిత్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన అద్బుతం అనే సినిమాలో తనతో నటించిన ఒకకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన షాలినిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండే అజిత్ భార్య శాలిని ఈ మధ్యకాలంలో సామాజిక మధ్యామంలోకి ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుండి ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అయితే ఈ ఇంస్టాగ్రామ్ ను షాలిని హ్యాండిల్ చేయడం లేదు.ఆమె అసిస్టెంట్ ఇకియా హ్యాండిల్ చేస్తుంది. ఈ మధ్య షాలిని, అజిత్, వారి కూతురు అనౌష్క, కొడుకు ఆద్విక్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో అజిత్ కూతురు అనుష్క చాలా అందంగా, హీరోయిన్ ల ఉండడంతో అజిత్ ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు. అజిత్ కూతురు అనుష్క ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటుంది.
Also Read: కేవలం ఒక్క డ్రెస్ తోనే పూర్తి చేసిన 8 సినిమాలు..