Ads
హీరో గోపీచంద్ గూర్చి టాలీవుడ్ ఆడియెన్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలివలపు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ తరువాత విలన్ గాను నటించాడు. ప్రస్తుతం హీరోగా వరుస మూవీస్ చేస్తున్నాడు. కాగా, గోపీచంద్ నేపధ్యం ఏంటి, ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనే విషయం చాలా మందికి తెలియదు.
హీరో గోపిచంద్ తండ్రి తొట్టెంపూడి కృష్ణ. ఆయన పుట్టింది వరంగల్. సినిమా మీద అభిమానంతో డిగ్రీ అవగానే మద్రాస్ ట్రైన్ ఎక్కాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇండస్ట్రీలో అన్ని రంగాల్లో కూడా అనుభవం సంపాదించుకున్నాడు. మద్రాస్ కి వెళ్ళాక HM రెడ్డి వద్ద దర్శకత్వ డిపార్ట్మెంట్ లో చేరాడు. ఎడిటింగ్‌లో MV రాజన్ వద్ద శిక్షణ తీసుకున్నాడు.ముప్పైకి పైగా సినిమాలకు ఎడిటర్‌గా చేసిన తర్వాత కృష్ణ డైరెక్టర్ గా మారాడు. సినీ పరిశ్రమలో ఆయన టి. కృష్ణగా సుపరిచితుడు.
ఈ క్రమంలోనే ఈతరం అనే బ్యానర్ ను మొదలుపెట్టి, ఎన్నో విజయవంతమైన మూవీస్ ను డైరెక్ట్ చేసిన కృష్ణ, మలయాళంలో కూడా కొన్ని మూవీస్ ని డైరెక్ట్ చేశాడు. T.కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమాలు ఏమిటో చూద్దాం.
Ads
- ఉపాయంలో అపాయం
ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు.
- దేశంలో దొంగలు పడ్డారు
సుమన్,విజయశాంతి హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా నటించారు.
- నేటి భారతం
ఈ సినిమాలో సుమన్, విజయశాంతి నటించారు.
- వందేమాతరం
ఈ సినిమాలో రాజశేఖర్ , విజయశాంతి,కోట శ్రీనివాస రావు నటించారు.
- దేవాలయం
ఈ సినిమాలో శోభన్ బాబు , విజయశాంతి, జెవి సోమయాజులు నటించారు.
- రేపటి పౌరులు
ఈ సినిమాలో రాజశేఖర్ , విజయశాంతి,కోట శ్రీనివాస రావు, నటించారు.
- ప్రతిఘటన
ఈ సినిమాలో చంద్రమోహన్ , విజయశాంతి,చరణ్ రాజ్ నటించారు.