Ads
అప్పుడప్పుడు అభిమాన హీరోల విషయంలో అభిమానులు చాలా ఆందోళన పడుతూ ఉంటారు.ముఖ్యంగా వారి సినిమాల విషయంలో మాత్రం అభిమానులు చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటారు. సరైన కథ లేకుండా.. లుక్స్ విషయం లో కేర్ తీసుకోకుండా.. నటన లో అతి చేస్తే వారి సొంత అభిమానులే ఆ సినిమాలు చూడటానికి ఇష్టపడరు. కొన్ని సార్లు హీరో కేరెక్టరైజేషన్ సరిగ్గానే ఉండదు. అసలు ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నాడురా బాబు అనిపిస్తాయి.. అలా ఇప్పటివరకు వచ్చిన చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
#1 పవన్ కళ్యాణ్ – అజ్ఞాతవాసి
పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో జల్సా తర్వాత వచ్చిన ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రం కూడా అలాగే పెద్ద ప్లాప్ అయ్యింది. అసలు ఈ సినిమాలో పవర్ స్టార్ పాత్ర కూడా పెద్దగా నచ్చలేదు ఫాన్స్ కి కూడా.
#2 నాగార్జున – ఆఫీసర్
అసలు రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో తీసిన శివ సినిమా ఇప్పటికే ట్రెండ్ సెట్టర్ ఏ. బట్ వీరిద్దరూ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత తీసిన ఆఫీసర్ సినిమా బిగ్ డిజాస్టర్ అయ్యింది. అసలు ఈ మూవీ లో నాగ్ పాత్ర ఎమోషన్ లెస్ గా అనిపిస్తుంది. అలాగే నాగ్ తీసిన భాయ్, గ్రీకువీరుడు చిత్రాల్లో కూడా ఆ కేరెక్టర్ ని భరించలేం.
#3 బాల కృష్ణ – ఒక్క మగాడు
ఈ చిత్రం లో బాలకృష్ణ కి జోడీగా అనుష్క, సిమ్రాన్ నటించారు. ఈ చిత్రం లో బాలయ్య రెండు పాత్రలు అస్సలు బాగోవు. వైవియస్ చౌదరి దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది. అలాగే బాలయ్య చేసిన రూలర్, అల్లరి పిడుగు చిత్రాల్లో కూడా హీరో కేరెక్టర్ ని భరించలేం.
#4 వెంకటేష్ – షాడో
మెహెర్ రమేష్ తీసిన ఒక కళాఖండం షాడో. ఈ చిత్రం లో వెంకటేష్ గెటప్, లుక్స్ అన్ని అస్సలు బాగోవు.
#5 ప్రభాస్ – బాహుబలి, చక్రం
ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసిన బాహుబలి చిత్రం లో శివుడి కేరెక్టర్ అస్సలు బాగోదు. తమన్నా తో ఆయన సీన్స్ అసలు చూడటానికి కనెక్ట్ అవ్వవు. అలాగే కృష్ణవంశీ తీసిన చక్రం సినిమాలో కూడా ప్రభాస్ పాత్రని భరించలేం.
#6 రవి తేజ – కిక్ 2
అసలు రవితేజ కెరీర్ లోనే వరస్ట్ కేరెక్టర్ ఇది. అసలు కిక్ సినిమా ఎంత సూపర్ గా ఉంటుందో ఈ సినిమా అంత చెండాలంగా ఉంటుంది.
#7 విజయ్ దేవరకొండ – లైగర్
అర్జున్ రెడ్డి తో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ చిత్రాన్ని తీసాడు. కానీ బేసిక్ గా పూరి సినిమాల్లో ఉండే హీరోల్లాగే ఆ పాత్ర కూడా చాలా అతిగా ఉంటుంది.
Ads
#8 నాని – నేను లోకల్
నాని తీసిన నేను లోకల్ చిత్రం హిట్ అయ్యింది కానీ.. ఆ చిత్రం లో నాని పాత్ర అస్సలు బాగోదు. చాలా అతిగా ఉంటుంది.
#9 రామ్ – ఇస్మార్ట్ శంకర్
రామ్ పోతినేని కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది ఈ చిత్రం. కానీ ఈ చిత్రం లో రామ్ కేరెక్టర్ చాలా అతి చేస్తూ ఉంటుంది.
#10 అఖిల్ – మిస్టర్ మజ్ను
మిస్టర్ మజ్ను చిత్రం లో అఖిల్ వెనుక అమ్మాయిలు పడుతూ ఉంటారు అని చూపిస్తారు. అది కొంచెం అతిగా అనిపిస్తుంది.
#11 నిఖిల్ – శంకరాభరణం
కార్తికేయ చిత్ర హిట్ తర్వాత నిఖిల్ చేసిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం లో నిఖిల్ పాత్రకి అసలు కనెక్ట్ అవ్వలేకపోయారు ఫాన్స్.
#12 ఆకాష్ పూరి – రొమాంటిక్
తన కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ నిర్మించారు. కానీ ఈ చిత్రం లో కూడా సేమ్ పూరి సినిమాల్లోని హీరోలు గుర్తొస్తారు.
#13 రాజ్ తరుణ్ – సినిమా చూపిస్తా మావా
రాజ్ తరుణ్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ సినిమా చూపిస్తా మావ..కానీ ఈ చిత్రం లో రాజ్ తరుణ్ పాత్ర కొంచెం అతి చేసినట్టు అనిపించింది.
#14 కార్తికేయ – 90 ml
అసలు ఈ చిత్రం ఆ హీరోకి ఆల్కహాల్ ఏ మెడిసిన్ అనే పాయింటే కొత్తగా ఉంది. కానీ ప్రేక్షకులకి ఇది నచ్చలేదు.
#15 అల్లు అర్జున్ – వరుడు
అల్లు అర్జున్ కి ఒక స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఉంది. అలాగే ఆక్టింగ్ కూడా బాగా చేస్తారు అని పేరు. కానీ ఈ మూవీ లో ఆ రెండు చాలా వరస్ట్ గా ఉంటాయి.
#16 ఎన్టీఆర్ – శక్తి
బాబోయ్ ఈ చిత్రం లో అసలు ఎన్టీఆర్ కేరెక్టర్ ఎలా ఉంటుంది అంటే.. ఫాన్స్ కూడా భరించలేరు. మెహెర్ రమేష్ తీసిన ఈ చిత్రం గురించి రిలీజ్ కి ముందు ఎంతో హైప్ ఇచ్చారు. కానీ రిజల్ట్ చూస్తే ప్లాప్ అయ్యింది.