Ads
బిగ్ బాస్. అన్ని భాషల్లో వస్తున్న ప్రోగ్రాం ఇది. ముందు ఇంగ్లీష్ నుండి హిందీకి వెళ్ళింది. అక్కడి నుండి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోకి ఈ ప్రోగ్రాం వెళ్ళింది. ప్రతి చోట ఈ ప్రోగ్రాం ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. మనకి బాగా తెలిసిన సెలబ్రిటీలు అందరినీ తీసుకెళ్లి, ఒక ఇంట్లో పెట్టి, వాళ్లకి టాస్క్ లు ఇచ్చి, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనేది ఈ ప్రోగ్రాం ద్వారా చూపిస్తారు. సెలబ్రిటీల జీవితాలు అంటే వాళ్లంతా చాలా ఆనందంగా ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్లు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తెలుస్తుంది.
ఈ ప్రోగ్రాంకి చాలా మంది సీరియల్స్ సెలబ్రిటీలు కూడా వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా సినిమాల్లోకి వెళ్తారు అని చాలా మంది అనుకుంటారు. బిగ్ బాస్ లో ఆ సీజన్ లో వాళ్ళకి వచ్చిన క్రేజ్ తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాల్లో కనిపిస్తారు. కానీ ఆ తర్వాత అవకాశాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే బిగ్ బాస్ ప్రోగ్రాం తర్వాత కూడా కెరీర్ నిలబెట్టుకోగలుగుతారు. తెలుగులో బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు చేరువ అయ్యి, తర్వాత హీరోగా పరిచయం అవ్వాలి అనుకున్న నటులు కొంత మంది ఉన్నారు.
కానీ వాళ్ళు ఎంచుకున్న స్క్రిప్ట్ ల వల్ల ఆ సినిమాలు ప్రేక్షకులని నిరాశపరిచాయి. కానీ తమిళ బిగ్ బాస్ మాత్రం తమిళ్ ఇండస్ట్రీకి కొంత మంది హీరోలని అందించింది. హరీష్ కళ్యాణ్ బిగ్ బాస్ ద్వారా చాలా మందికి పరిచయం అయ్యారు. తెలుగులో జెర్సీ సినిమాలో నాని కొడుకుగా హరీష్ కళ్యాణ్ నటించారు. బిగ్ బాస్ కి ముందు హరీష్ కళ్యాణ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ బిగ్ బాస్ తర్వాత ఇంకా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు హరీష్ కళ్యాణ్ చేస్తున్నారు.
Ads
అయితే బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా హీరోగా సక్సెస్ అయిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను కవిన్. 2012 లో పిజ్జా సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించారు. ఈ సినిమాలో తన పాత్రకి పేరు కూడా లేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో కూడా అంత గొప్ప పాత్రలు ఏమీ రాలేదు. 2011 నుండి సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. 2019 లో వచ్చిన బిగ్ బాస్ తమిళ్ ప్రోగ్రాం కవిన్ జీవితాన్ని మార్చేసింది. అందులో కవిన్ దాదాపు 94 రోజులు ఉన్నారు. దాంతో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ ప్రోగ్రాం నుండి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే కవిన్ కి హీరోగా అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. 2019 లోనే నాట్పున ఎన్నను తేరియుమా అనే సినిమాలో మొదటిసారిగా హీరోగా నటించారు. ఆ తర్వాత లిఫ్ట్, డాడా సినిమాల్లో హీరోగా నటించారు. ఈ సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇటీవల స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. మధ్యలో ఆహాలో ఆకాష్ వాణి అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు. అది కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
కవిన్ తోపాటు మరి కొంత మంది బిగ్ బాస్ తమిళ్ కంటెస్టెంట్స్ కూడా హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ కవిన్ కి మాత్రం బిగ్ బాస్ ప్రోగ్రాం తర్వాత హీరోగా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు కూడా ప్రకటించారు. అవి షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో కూడా గెటప్ చాలా డిఫరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా బిగ్ బాస్ అనే ఒక దారిని సరైన మార్గంలో ముందుకి నడిచేలా చూసుకున్నారు కవిన్. అందుకే జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు.