కన్నడ “సలార్” లో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పిన ఈ హీరో ఎవరో తెలుసా..? అచ్చం ప్రభాస్ వాయిస్ లానే ఉంది కదా..?

Ads

పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాలలో సలార్‌ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ను క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం భాషల్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‍లో అన్ని భాషల్లో కలిపి 24 గంటలు గడవకముందే వంద మిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డ్ సృష్టించింది. అయితే కన్నడలో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పింది ఒక హీరో. మరీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ads

సలార్‌ కన్నడ మూవీలో హీరో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన హీరో పేరు వశిష్ట సింహ. అతను కన్నడ హీరో. ఎక్కువగా కన్నడ సినిమాలలో నటించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన వశిష్ట ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కన్నడ ఇండస్ట్రీలో 2013 లో ఆర్యస్ లవ్ అనే సినిమాలో తొలిసారి నటించాడు.
ఆ తరువాత అదే ఏడాది రాజా హులి మూవీలో మెయిన్ విలన్ గా నటించాడు. ఆ పాత్రకి గురింపు రావడంతో వరుసగా కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. హీరోగా, సహనటుడుగా, విలన్ గా నటిస్తూ బిజీగా మారారు. కేజీఎఫ్ 1 లో కమల్ పాత్రలో నటించాడు. తెలుగులో నారప్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో శీనప్పగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత నయీమ్ డైరీస్ లో హీరోగా నటించాడు. ఓదెల రైల్వే స్టేషన్ లో కూడా నటించాడు.
వశిష్ట భార్య కూడా హీరోయిన్. ఆమె ఎవరో కాదు హరిప్రియ. ఈ జంట ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. హరిప్రియ పలు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కన్నడలో అనేక చిత్రాలలో నటించిన హరిప్రియ తెలుగులో తకిట తకిట, పిల్లజమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట, ఈ వర్షం సాక్షిగా, జైసింహా వంటి సినిమల్లవ్ నటించింది.

Also Read: 30 ఏళ్ల యంగ్ హీరోకి అక్కగా నయనతార..! ప్రేక్షకులు అంగీకరిస్తారా..?

 

Previous articleఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..? అసలు ఏం ఉంది ఇందులో..?
Next article76 ఏళ్ల క్రితం టీం ఇండియా కెప్టెన్ ఎవరో తెలుసా..? అప్పట్లో ఆస్ట్రేలియా వెళ్లిన ప్లేయర్స్ ఎవరంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.