Ads
కేజిఎఫ్ చిత్రం కన్నడ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా లో రాఖీ బాయ్ గా నటించిన హీరో యశ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు మరియు అభిమానులను సంపాదించు కున్నాడు. కేజిఎఫ్ సిరీస్ లో ఇప్పటివరకు రెండు పార్ట్ లు విడుదల అయ్యాయి.
Ads
ఇక రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన వారందరికి బిగ్గెస్ట్ ప్లస్ గా మారిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోగా నటించిన యశ్ కి మాత్రమే కాకుండా ఈ మూవీలో నటించిన మిగతా పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోకు ఎంత గుర్తింపు వచ్చిందో, అంతే గుర్తింపు విలన్ కి వచ్చిందని చెప్పవచ్చు. ఈ మూవీలో రాఖీ క్యారెక్టర్ కి దీటుగా విలన్ గరుడ క్యారెక్టర్ పాపులర్ అయింది.ఇక కేజీఎఫ్ లో విలన్ గరుడ క్యారెక్టర్ చేసిన వ్యక్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అది ఏమిటి అంటే కేజిఎఫ్ పార్ట్ 1 లో గరుడ క్యారెక్టర్ చేసిన అతని పేరు రామ్. అయితే వాస్తవానికి రామ్ యాక్టర్ కాదు. అతను హీరో యష్ కు కారు డ్రైవర్ మరియు పర్సనల్ బాడీగార్డ్. అతను చాలా కాలం నుండి యష్ కు సన్నిహితుడుగా ఉన్నారంట. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ స్టోరీ గురించి యశ్ చర్చించడానికి వెళ్ళిన సమయంలో రామ్ ని చూశారట.
రామ్ అయితే గరుడ క్యారెక్టర్ కి సెట్ అవుతాడని అనుకుని, ఆడిషన్స్ కు రమ్మని చెప్పాడట. ఆడిషన్స్ కు వెళ్ళిన రామ్ అందులో ఎంపిక కావడంతో గరుడ క్యారెక్టర్ తగ్గట్టుగా మారడం కోసం జిమ్ లో ఎన్నో కసరత్తులు చేసి దర్శకుడు ప్రశాంత్ కలిసాడట. ప్రశాంత్ నిల్ అతని డెడికేషన్ చూసి, గరుడ పాత్రకి అతన్ని ఫైనల్ చేశారట. ఈ విషయన్ని రామ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా ఎంపిక అయిన రామ్ గరుడ క్యారెక్టర్ అదరగొట్టారు. ఈ మూవీతో స్టార్ యాక్టర్ గా మారి ప్రసత్తటం బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు.Also Read:లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ను గమనించారా?