ఈ ఫోటోలో 2 హీరోలు, ఒక హీరోయిన్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

Ads

ఎంతో మంది నటులు, సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా అడుగు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ పెద్దయ్యాక ప్రధాన పాత్రల్లో సినిమాల్లో నటిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా చిన్నప్పుడే సినిమాల్లో నటించిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో వారసత్వంతో వచ్చిన వారు కూడా ఉన్నారు. తమ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా సినీ రంగంలో ఉంటే, ఆ తర్వాత వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత తమకి తాము ఎంతో కృషి చేసి గుర్తింపు సంపాదించుకున్నారు.

heroes and heroine in this picture

ఈ పైన ఫొటోలో ఉన్న ముగ్గురు కూడా నటులే. ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్న ఒక కుటుంబానికి చెందిన వారే. వీరు మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్. వీరు ముగ్గురు కూడా ఇవాళ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. మంచు లక్ష్మి నటించిన యక్షిణి వెబ్ సిరీస్ కూడా విడుదల అయ్యింది. మంచు మనోజ్ మిరాయి సినిమాలో నటిస్తున్నారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు గారు కూడా నటించారు. ఎంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

Ads

ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, నయనతార, కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా టీజర్ ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చేశారు. ఈ స్క్రీనింగ్ కి మంచు విష్ణు, విరోనికా, మోహన్ బాబు గారు, ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ప్రభుదేవా వెళ్లారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో ప్రాంతాల్లో ఈ సినిమాని తెరకెక్కించారు. విదేశాల్లో కూడా ఈ సినిమాని షూట్ చేశారు.

Previous articleతెలుగులో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ముందు ఉండే సినిమా ఇది..! ఈ సినిమా చూశారా..?
Next articleఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.