అనుష్కకి భర్తగా, లవర్ గా, కొడుకుగా నటించిన… ఈ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా..?

Ads

సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన అనుష్క శెట్టి బాహుబలి చిత్రం తర్వాత చిత్రాలను తగ్గించేసింది. బాహుబలి తర్వాత అనుష్క చాల ఆచితూచి చిత్రాలను చేస్తోంది. ఆ తర్వాత భాగమతి, నిశ్శబ్దం చిత్రాలు మాత్రమే చేసింది. గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం అనుష్క ఒక మలయాళం సినిమా కూడా చేస్తోంది.

సూపర్ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తక్కువ కాలం లోనే స్టార్ హీరోలందరితో నటించేసింది. అరుంధతి చిత్రం తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రసుగా మారిపోయింది అనుష్క. ఆ తర్వాత రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం తో నేషనల్ స్టార్ గా మారిపోయింది.

Ads

అయితే తన కెరీర్ లో అనుష్క చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. కానీ ఒక ఇద్దరు హీరోలు మాత్రం ఆమెకు కొడుకుగా, లవర్ గా, భర్తగా నటించారు. వారిద్దరూ ఎవరా అనుకుంటున్నారా.. వారే ప్రభాస్, అడివి శేష్. ప్రభాస్, అనుష్క ది సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరూ చాలా హిట్ చిత్రాల్లో నటించారు. అయితే అనుష్కకి ప్రభాస్ బిల్లా, మిర్చి చిత్రాల్లో లవర్ గా నటించాడు. అలాగే బాహుబలి చిత్రం లో ప్రభాస్ పాత్ర అమరేంద్ర బాహుబలి అనుష్కకి భర్తగా, మరో పాత్ర అయిన శివుడు కొడుకుగా నటించాడు.

అలాగే మరో హీరో అడివి శేష్ కూడా అనుష్కకి భర్తగా, లవర్ గా, కొడుకుగా నటించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిన అడివి శేష్.. కెరీర్ ప్రారంభం లో చాలా చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ అనుష్క నటించిన సైజ్ జీరో చిత్రం లో అనుష్కకి లవర్ గా నటించాడు. అలాగే నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి చిత్రం లో అనుష్కకి భర్తగా నటించాడు శేష్. అదే విధంగా బాహుబలి చిత్రం లో అడివి శేష్ భల్లాల దేవుడికి కొడుకుగా నటించారు. అలా చూస్తే అమరేంద్ర బాహుబలి, దేవసేన పాత్రలకు కూడా కొడుకే. ఇలా శేష్ అనుష్క కి కొడుకు పాత్రలో కూడా నటించాడు.

Previous articleKalki 2898 AD Review : “ప్రభాస్ – నాగ్ అశ్విన్” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleకల్కి సినిమాలో “కృష్ణుడి” పాత్రకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఎవరో తెలుసా..? ఈ వాయిస్ చాలా ఫేమస్..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.