Ads
తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి, స్టార్ హీరోల సినిమాలలో నటించారు. పెద్దయ్యాక అదే హీరోల పక్కన హీరోయిన్లుగా కూడా నటించారు.
సీనియర్ హీరోయిన్ శ్రీదేవి ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించింది. పెద్దయ్యాక ఎన్టీఆర్ పక్కన ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఆమె లానే ఒక హీరోయిన్ బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత కాలంలో ఆయన భార్యగా నటించింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
1989లో బాలకృష్ణ, సుహాసిని హీరోహీరోయిన్లుగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ‘బాలగోపాలుడు‘ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో బాలకృష్ణతో ఒక పాప, ఒక బాబు ఉంటారు. వీరిద్దరి నటన ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. బాలయ్యతో నటించిన ఆ పాప, తరువాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆయన పక్క హీరోయిన్ గా నటించారు.
ఆమె మరెవరో కాదు. సీనియర్ హీరోయిన్ రాశి. ఆమె అసలు పేరు విజయ. ఆమె 1980లో చెన్నైలో పుట్టి, అక్కడే పెరిగారు. ఆమె తండ్రిది చెన్నై. ఆమె తల్లి సొంతూరు భీమవరం. రాశి తండ్రి కూడా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం తరవాత డ్యానర్స్ గా మారారు. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో రాశి రావుగారిల్లు సినిమాతో బాలనటిగా మొదటిసారి నటించారు. ఆ తరువాత పలు చిత్రాలలో బాలనటిగా అలరించింది.
1997లో శుభాకాంక్షలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో మంచి గుర్తింపును పొందిన రాశి, తక్కువ కాలంలో అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తమిళంలో కూడా పలు సినిమాలో నటించింది. బాలగోపాలుడు సినిమాలో బాలయ్యతో బాలనటిగా నటించిన రాశి పదేళ్ళ తరువాత బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా కృష్ణబాబు సినిమాలో నటించింది. ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.
Ads
Also Read: Review: కంచెరపాలెం ఫేమ్ కార్తీక్ నటించిన “లింగోచ్చా” సినిమా ఎలా ఉంది..? అసలు లింగోచ్చా అంటే ఏంటి..?