బాహుబ‌లి మూవీలో త‌మ‌న్నా క్యారెక్టర్ చేజార్చుకున్న స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Ads

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు బాలీవుడ్ సినిమాల కన్నా తక్కువ కాదని తెలియచేసిన చిత్రం బాహుబలి.

ఈ మూవీతోనే దక్షిణాది నుండి పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా రావడం ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చింది. ఈ సినిమాలో మొదటి భాగంలో బాహుబలి, శివగామి, బళ్లాలదేవుడు, కట్టప్ప, అవంతిక ముఖ్యమైన పాత్రలు. అవంతిక పాత్రలో హీరోయిన్ తమన్నా నటించింది. అయితే ఈ పాత్రని ఒక స్టార్ హీరోయిన్ చేజార్చుకుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే అవంతిక పాత్రని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ రాశి ఖన్నా టాలీవుడ్ లో తక్కువ వ్యవధిలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆమె ఎన్నో హిట్ సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీ కోలీవుడ్ లోనూ పలు సినిమాలలో నటించింది. ఆమె సినిమాలలోనే కాకుండా ఓటీటీలోనూ తన సత్తా చూపిస్తున్నారు. రాశి ఖన్నా మద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్స్ రావడంతో టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అయితే రాశి ఖన్నా ఇటీవల బాహుబలి మూవీ పై ఇంట్రెస్టింగ్  కామెంట్స్ చేసింది.
అవి ఆమె మాటల్లోనే, న మొదటి మూవీ మద్రాస్ కేఫ్ పూర్తయ్యాక రాజమౌళి సార్ బాహుబలి చిత్రంలోని  తమన్నా చేసిన అవంతిక క్యారెక్టర్ కోసం ఆడిషన్ నిర్వహిస్తున్నారు. నాకు కాల్ వచ్చింది. ఆ అడిషన్స్ కి వెళ్లాను. అయితే రాజమౌళి సార్ నన్ను చూడగానే ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది. ప్రేమ కథ చిత్రాలకి అయితే సెట్ అవుతుందని చెప్పాడు. అంతే కాకుండా నా ఫ్రెండ్స్ లో  ఒకరు లవ్ స్టోరి పై పని  చేస్తున్నాడు. ఆ స్టోరి విను నీకు నచ్చుతుంది అని చెప్పారు. అలా నేను ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తెలుగులో అడుగు పెట్టాను అని తెలిపారు. కానీ డైరెక్టర్ రాజమౌళి మూవీలో చిన్న క్యారెక్టర్ లో అయినా నటించాలని ఉందని  రాశిఖన్నా చెప్పు కొచ్చింది.

Ads

Also Read: ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ప్రస్తుతం ఆమె స్టార్‌ హీరోయిన్‌..

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Previous articleహీరో జయం రవి క్యూట్ ఫ్యామిలీని చూశారా? వైరల్ గా మారిన పొటోలు..
Next articleచిన్నారుల్లో కాల్షియం లోపం రాకూడదంటే వారి ఆహారంలో వీటిని చేర్చాల్సిందే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.