సాయి పల్లవి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా..? ఏంటి ఆమె ప్రత్యేకత..?

Ads

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయిన సాయి పల్లవి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈమెను ముద్దుగా అభిమానులు లేడి పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. హీరోయిన్స్ లో ఎక్కువగా ఫాన్స్ ఫాలోయింగ్ కలిగిన వారిలో సాయి పల్లవి కూడా ఒకరు.

మలయాళం మూవీ ప్రేమమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. తన డాన్స్ నటనతో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగులో చివరగా విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత మరే సినిమాలో నటించలేదు సాయి పల్లవి.

Ads

అంతే కాకుండా ఈ సినిమాలు విడుదల అయిన తర్వాత కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమయింది సాయి పల్లవి.. అయితే ఈ ముద్దు గుమ్మ సినిమాలలో నటించకపోయినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి ఇటీవలే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సాయి పల్లవి తన తరువాత సినిమాల కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అది కూడా కొంతమంది హీరోలకన్నా ఎక్కువగా. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట సాయి పల్లవి. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త విన్న సాయి పల్లవి అభిమానులు ఇది కదా సాయి పల్లవి అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleతెలంగాణాలో “బీఆర్ఎస్” ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవేనా.? అదే కాంగ్రెస్ గెలుపుకి కారణమైందా.?
Next articleరేవంత్ రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా..? అయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.