రజినీకాంత్ “నరసింహ” సినిమాలో… “నీలాంబరి” పాత్రని వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో… తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. రజనీకాంత్ ప్రతి సినిమాకి తెలుగులో నీరాజనం పడుతుంటారు అభిమానులు.

1999 సంవత్సరంలో వచ్చిన రజనీకాంత్ సినిమా నరసింహ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో రజనీకాంత్ మేనరిజమ్స్ కి , డైలాగ్స్ కి విజిల్స్ పడతాయి ఇప్పటికి కూడా….!

ఈ సినిమాలో రజనీకాంత్ కి పోటా పోటీగా రమ్యకృష్ణ నటించారు. నీలాంబరి పాత్ర అంటే రమ్యకృష్ణ నే గుర్తొస్తారు…అలా ఉంటుంది ఆమె నటన. ఇందులో రజనీకాంత్ కి జోడిగా సౌందర్య నటించారు. కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో స్టార్ కాస్ట్ చాలామంది ఉన్నారు. శివాజీ గణేషన్, లక్ష్మీ ,నాజర్, అబ్బాస్,ప్రీతి విజయకుమార్, ప్రకాష్ రాజ్, సితార, రాధారవి వంటి ప్రముఖులు నరసింహ చిత్రంలో నటించారు. ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికీ కూడా మారుమోగుతూ ఉంటాయి.

Ads

అయితే నరసింహ సినిమాలో ముందుగా సౌందర్య పాత్రకి వేరే హీరోయిన్ ను అనుకున్నారట… ఆమె డేట్లు లేకపోవడంతో ఆ పాత్ర సౌందర్యకి దక్కటం మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇంతకీ ఆ పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా… మీనా…! అవును ఈ పాత్ర కోసం ముందుగా మీనాన్ని సంప్రదించగా డేట్లు సర్దుబాటు చేయలేక వదులుకున్నారట. అలాగే ఇదే సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి కూడా మీనా ను అడిగారు. అప్పుడు కూడా డేట్లు ఖాళీ లేకపోవడంతో కథ నచ్చిన కూడా మంచి సినిమా వదులుకున్నానే అంటూ మీనా బాధపడిందట

Previous articleఈ కాలంలో కూడా మీలాంటి వెనుకబడిన ఆలోచన ఉన్నవారు ఇంకా ఉన్నారు అని నిరూపించారు..! సూపర్ సర్..!
Next articleశనివారం రోజు నాన్-వెజ్ తినకూడదు అని ఎందుకు అంటారు..? కారణం ఏంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.