హీరోల‌కు సూప‌ర్ స్టార్‌, మెగాస్టార్ బిరుదులు ఎలా వచ్చాయంటే…?

Ads

చాలా మందికి సినిమాలు చూడడం అంటే ఎంతో ఇష్టం. పైగా ఇష్టమైన నటులు సినిమాలైతే అసలు వదలరు. నిజానికి మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి వీరాభిమానులు ఉన్నారు. అభిమానులు వాళ్ళ హీరో సినిమా వచ్చినా లేదంటే వాళ్లకి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చినా సరే ఎంతో ఆసక్తి తో చూస్తూ ఉంటారు. అయితే మన హీరోలకి పేరుకు ముందు సూపర్ స్టార్, మెగాస్టార్, స్టైలిష్ స్టార్ ఇలా కొన్ని బిరుదులు ఉంటాయి.

మీకు ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? ఏ హీరోకి ఎందుకు ఆ బిరుదు వచ్చింది అని.. నిజానికి సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఉన్న క్రేజ్ ఇంకెవరికి కూడా ఉండదు.

దర్శకులకి కానీ నిర్మాతలకి కానీ హీరోలకి ఉన్నంత క్రేజ్ రాదు. సినిమాని ఎంత బాగా తీసుకువచ్చినా సరే క్రేజ్ అంతా వాళ్ళకి రాదు. పైగా ఆ గొప్పతనం అంతా హీరోల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. హీరో కోసమే చాలా మంది సినిమాలు చూస్తారు పైగా పెద్ద పెద్ద కటౌట్లని కూడా పెడుతూ ఉంటారు.

Ads

హీరోకి అభిమానుల్లో ఉన్న క్రేజ్ ని ఆధారంగా తీసుకుని హీరో పేరు మొదట స్టార్ అనే బిరుదుని దర్శక నిర్మాతలు ఫిక్స్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని మొదట సుప్రీం హీరో అని ముద్దుగా పిలిచేవాళ్లట తర్వాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరణ మృదంగం సినిమా లో మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి అనే బిరుదుని ఇచ్చారు. మెగాస్టార్ అని దర్శకుడు కోదండరామిరెడ్డి ఇచ్చారు.

జ్యోతిచిత్ర పత్రిక 1982లో “సూపర్ స్టార్” అనేది ఎవరికి ఇవ్వాలి అని పోల్ ని నిర్వహించింది. అయితే ఈ పోల్ లో కృష్ణ కి ఈ టైటిల్‌ను ఇవ్వాలని ఎక్కువ మంది అన్నారు. ఇలా పబ్లిక్ ఛాయిస్ తో కృష్ణ గారికి సూపర్ స్టార్ అనేది వచ్చింది. అప్పటి నుండి ఆయన సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు.

ఇక బన్నీ విషయానికి వస్తే పుష్ప చిత్రం తో బన్నీ సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఆ సినిమాతోనే అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అని సుకుమార్ బిరుదుని ఫిక్స్ చేశాడు. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయిపోయారు. ఇలా హీరోలకి పేరు కి ముందు స్టార్ అని పెడతారు. 1957 లో అయితే అక్కినేని నాగేశ్వరరావు గారికి మంత్రి బెజవాడ గోపాలరెడ్డి నటసామ్రాట్ అని ఇచ్చారు.

Previous articleటూత్ పేస్ట్ ట్యూబుల మీద ఈ రంగు బాక్సులు ఎందుకు ఉంటాయి..?
Next articleఎందుకు ఆడవాళ్ళ జీన్స్ కి మగవారి జీన్స్ కి ఉన్నట్టు జేబులు వుండవు.. ఇంత పెద్ద చరిత్రా..?