ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చిన శోభా శెట్టి.. బిగ్ బాస్ హౌస్ లో ఉంటూనే ఆ ప్రోగ్రాం లో ప్రత్యక్షం? ఎలా సాధ్యం.?

Ads

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శోభా స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యింది. కాగా శోభా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. 11 వారాల నుంచి శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పటికే చాలా వారాలు ఆమె ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు భావించినప్పటికీ అదృష్టవశాత్తు సేమ్ అవుతూ వస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న శోభా శెట్టి తాజాగా ఒక ఈటీవీ ప్రోగ్రాంలో కనిపించి ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ప్రోమోని చూసిన ప్రేక్షకులు ఇదేలా సాధ్యం అంటూ షాక్ అవుతున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ పేరుతో ఒక రియాలిటీ షో రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పెద్దగా పాపులర్ అవలేదు. కానీ అందులో శోభాశెట్టి పార్టిసిపేట్ చేసింది. ఆమె పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ నవంబర్ 21న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ అందరూ చూడాలని ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈటీవీ చేసిన ఈ ప్రోగ్రామ్ ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ చేసింది ఛానెల్.

Ads

ఈ ఎపిసోడ్ లో శోభాతో పాటు మరో ఇద్దరు మేల్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. కానీ వారి కంటే శోభా ఎక్కువ పాపులారిటీని సంపాదించింది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న శోభా సడన్ గా ఈటీవీ ప్రోగ్రామ్ లో ఎలా ప్రత్యక్షం అయింది? దాదాపు 80 రోజులుగా ఆమె హౌజ్ లో ఉంది. బయటకు వచ్చే ఛాన్స్ లేదు.

ఏ విధంగా చూసినా శోభా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటిది ఈ ప్రోగ్రామ్ లో ఎలా పాల్గొంది? సీక్రెట్ గా హౌజ్ నుంచి అడుగుపెట్టి ఈటీవీలో కనిపించిందా? లేక బిగ్ బాస్ నిర్వాహకుల పర్మిషన్ తీసుకుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల్లో మెదులుతున్నాయి. ఈ ప్రోమో చూస్తే చాలా రీసెంట్ గా అనిపిస్తుంది. కాబట్టి ఈ డౌట్స్ రావడం కూడా సహజం. అయితే వాస్తవానికి ఈ టీవీ చాలా రోజుల క్రితం షూట్ చేసిన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేస్తుంటుంది. అదే పద్ధతిలో శోభా శెట్టి ఎపిసోడ్ కూడా నవంబర్ 21న ప్రసారం చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రోమోకి నెటిజెన్స్ కూడా యూట్యూబ్ లో అదే కామెంట్స్ చేస్తున్నారు.

watch video: >>>CLICK HERE<<<

Previous articleరిలీజ్ అయ్యి నెల కాలేదు… మళ్ళీ రీ-రిలీజ్ ఏంటో.? కారణం ఇదేనా.? మరి OTT లో ఎప్పుడు.?
Next articleఏంటి “హ్యుండాయ్” కార్లపై లోగోలో ఉన్నది “H” కాదా.? దాని వెనకున్న అర్థం ఏంటంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.