Ads
ఈ మధ్యకాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్లు రావడం.. అందరూ కొత్త సినిమాలని ఓటీడీలలోనే చూడడం జరుగుతోంది. కరోనా మహమ్మరి సమయంలో థియేటర్లలో సినిమాలు విడుదల కాలేదు. కేవలం ఓటిటి ప్లాట్ ఫామ్లలోనే సినిమాలన్నీ విడుదల చేశారు అయితే ఓటిటి ప్లాట్ ఫామ్ లకి డబ్బులు ఎలా వస్తాయి..? ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? చాలా మందిలో ఈ సందేహం ఉండే ఉంటుంది.
మరి ఈరోజు ఓటీటీ ప్లాట్ ఫామ్లకి డబ్బులు ఎలా వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. చాలా సినిమాలు ఓటీటీ లో మనకి కనబడుతూ ఉంటాయి.అలానే వెబ్ సిరీస్ మొదలు షోస్ దాకా చాలా ఓటీటీలలో మనం చూడొచ్చు. ఓటీటీ ఫుల్ ఫామ్ ‘ఓవర్ ది టాప్’. టీవీకి కేబుల్ సర్వీస్ లేకుండా మనం కేవలం ఇంటర్నెట్ తో సినిమాని చూసేయొచ్చు.
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ ఫైవ్, హాట్స్టార్ ఇలా ఇవన్నీ కూడా ఓటిటి చానల్స్. మామూలుగా సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూడడం డబ్బులు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఓటీటీ లో ఇలా అవ్వదు కదా మరి దేని ద్వారా ఎలా డబ్బులు వస్తాయి..?
Ads
అసలు ఓటీటీ వాళ్లకి ఎలా డబ్బులు వస్తాయి అనేది తెలుసుకుందాం. అయితే ఏదైనా సినిమాని ఉదాహరణకి ఐదు కోట్లు పెట్టి తీసారంటే ఒక రెండు కోట్లు ఎక్కువ వేసుకుని ఏడు కోట్లకి ఓటీటీ ప్లాట్ ఫామ్ కి అమ్ముతారు లేదంటే ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వాళ్ళే సినిమా తీసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సినిమా బడ్జెట్ చెప్తారు అయితే వీళ్ళు ఇచ్చిన డబ్బులు కంటే తక్కువ బడ్జెట్ లోనే సినిమా అయ్యేలా చూస్తారు. అప్పుడు మిగిలిన కొంత అమౌంట్ వాళ్ళు ఉంచుకుంటారు. మూడు రకాలుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లకి డబ్బులు వస్తాయి.
- TVOD:
ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్. ప్రతీ వీడియో చూడడానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దానినే ట్రాన్సాక్షన్ వీడియో ఆన్ డిమాండ్ అని అంటారు.
- SVOD:
వీడియో వీడియో కి కాకుండా నెలకి కానీ ఆరు నెలలకి కానీ లేదంటే ఏడాదికి కానీ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. చాలామంది ఎక్కువగా ఈ ప్యాకేజ్ కి ప్రిఫర్ చేస్తారు.
- AVOD:
మనం ఏదైనా వీడియో చూస్తే వీడియో మధ్యలో యాడ్లు వస్తూ ఉంటాయి. ఇలా కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లకి డబ్బులు వస్తాయి.