Ads
చిరుతిండి తినాలనిపించగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది సమోసా. ఇక సమోసాను ఇష్టపడని వారంటు ఉండరు. అయితే ప్రాంతాన్ని బట్టి సమోసా పేరు, ఆకారం, రుచి వేరుగా ఉన్నప్పటికీ అందరికి నచ్చే వంటకం ఇది. భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లోను సమోసా లభిస్తుంది.
అందువల్ల సమోసా ఇండియాలోనే పుట్టిందని అనుకుంటారు. కానీ అది మనదేశం చిరుతిండి కాదు. వాస్తవానికి వేల మైళ్లు దూరం ప్రయాణించి సమోసా భారత్ ని చేరిందని చరిత్రకారులు తెలుపుతున్నారు. సమోసా కేవలం చిరుతిండి మాత్రమే కాదు. దేశ సంస్కృతిలో, రాజకీయాలలోనూ ఒక భాగంగా మారింది. ఆర్జేడీ పార్టీ స్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన ‘జబ్ తక్ సమోసా మే ఆలూ రహేగా’ అనే స్లోగన్ అప్పట్లో దేశ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. అయితే ఈ స్లోగన్ 1990లలో అతిపెద్ద నినాదంగా మారింది. కాగా ప్రస్తుతం లాలూ ప్రసాద్ బీహార్ పాలిటిక్స్ లేరు. బంగాళాదుంప(ఆలుగడ్డ) మాత్రం సమోసాలోనే ఉంది. బీహార్ రాష్ట్రంలో అన్ని దుకాణాలలో సమోసా దొరుకుతుంది.
బహ్రాల్ సమోసాను తొలిసారి భారతదేశ సరిహద్దులో ఇబ్న్ బటుటా అనే ప్రయాణికుడు ప్రస్తావించారు. ఇబ్న్ బటుటా అనే వ్యక్తి మొరాకోకు చెందినవాడు. అతను తుగ్లక్ సామ్రాజ్యంను ఏలే సమయంలో సిల్క్ రోడ్ ద్వారా ఇండియాకి వచ్చాడు. అతను తన రచనలలో సమోసాను ప్రస్తావించారు. అనగా పదమూడవ శతాబ్దంలో తొలిసారి సమోసా గురించి చెప్పబడింది.
Ads
అంతేకాక 1469-1500 మధ్యలో రాసిన నిమ్తనామ అనే బుక్ లో కూడా సమోసాల గురించి చెప్పబడింది. ఆహారం, పానీయాల గురించి వివరంగా ఉంది. ఆ సమయంలో ఘియాస్ అల్ దిన్ ఖిల్జీకి పాలన సాగుతోంది. ఇంకా ఈ పుస్తకంలో ఎనిమిది రకాల సమోసాలు గురించి ప్రస్తావించబడ్డాయి. అయితే వాటిలోఎక్కడ బంగాళాదుంప గురించి లేదు. కొబ్బరి, క్రీమ్, మాంసం, ఇతర పదార్ధాలను సమోసాలలో ఉపయోగించారు. అయితే అక్బర్ రాసినటువంటి అమీర్ ఖుస్రో పుస్తకంలో కూడా సమోసాల గురించి ప్రస్తావించారు.
భారతదేశం ఎలా వచ్చింది?
సమోసా సరిహద్దులు దాటి ఇండియాలోకి వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక దీనిని కొన్ని చోట్ల సంబుసా అని, ఇంకొన్ని చోట్ల సమాసా అని అంటున్నారు. అయితే తొలి రోజుల్లో సమోసాలో మాంసం, క్రీమ్,పిస్తా లాంటి పదార్ధాలను ఉపయోగించారు. మధ్య ఆసియా నుండి సమోసా వచ్చిందని, కానీ ఇప్పుడు ఉపఖండానికి ఫుడ్ గా మారిందని చరిత్రకారుడు పుష్పేష్ పంత్ చెబుతున్నారు. బెంగాల్‌లో తియ్యటి సమోసాను ఇష్టంగా తింటారు. ఢిల్లీలో ఉండే రెస్టారెంట్లలో ఎక్కువగా చాక్లెట్ సమోసాలు అభిస్తాయి. సమోసాలను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తింటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వేడి వాతావరణంలో వీటిని ఎక్కువసేపు ఉంచవచ్చు. సమోసాను బయట ఉంచినప్పటికి త్వరగా చెడిపోదు. సమోసా భారతదేశానికే మాత్రమే పరిమితం అవలేదు. బ్రిటీషర్లు సమోసాలను చాలా ఇష్టంగా తింటారు. బ్రిటన్ కు వెళ్లిన ఇండియన్స్ వారికి సమోసాలను రుచి చూపించారు. సమోసాను ఎలాగైనా తినవచ్చు. పేరు ఏదైనప్పటికి సమోసాను తిన్నవాళ్లు దాని రుచి అద్భుతం, అమోఘం అంటారు.
Also Read: ఈసారి హైదరాబాద్ కి వెళ్ళినపుడు బిర్యాని మాత్రమే కాకుండా వీటిని కూడా రుచి చూడండి..