Ads
భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త అసలు ఈ పనులని చేయకూడదు. ప్రతి స్త్రీ కి కూడా అమ్మతనం అనేది ఒక గొప్ప వరం. ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ తర్వాత ఆ బిడ్డతో కలిసి కలకాలం ఉండాలని ప్రతి మహిళ కూడా కోరుకుంటూ ఉంటుంది. పైగా ఆ తల్లికి మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఎనలేని ఆనందాన్ని ఆ మహిళ ఇస్తుంది. ఏది ఏమైనా గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా వేళకి తినడం, మందులు వేసుకోవడంతో పాటుగా మంచి వైద్యుడిని సంప్రదించడం స్కానింగ్స్ కోసం చెప్పినప్పుడు వెళ్లడం ఇలా గర్భిణీ పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి.
అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అయితే భర్త కూడా కొన్ని పనులు కి దూరంగా ఉండాలి. మీ భార్య కనుక గర్భిణీ అయితే కచ్చితంగా మీరు వీటిని అనుసరించండి. అసలు ఈ పనులని భర్త చేయకూడదు. సో ఈ తప్పులు మీరూ చెయ్యకుండా చూసుకోండి.
Ads
#1. భార్య గర్భవతి అయితే భర్త సముద్ర స్నానానికి వెళ్ళకూడదు. అలానే భర్త చెట్లు నరక్కూడదు. ఈ తప్పులు చేస్తే అరిష్టం.
#2. భార్య గర్భవతి అయితే భర్త ఆరు నెలల దాకా షేవింగ్ చేయించుకోరాదు. జుట్టు కూడా కత్తిరించుకోకూడదు.
#3. భర్త విదేశీ యాత్రలు చేయడం కూడా మంచిది కాదు. భర్త ఆమె కి దూరంగా వెళ్ళరాదు.
#4. అంతిమ యాత్రలలో పాల్గొనడం వంటివి చెయ్యకూడదు భర్త. స్మశానాలకు కూడా వెళ్ళకూడదు భర్త.
#5. భార్యకి ఏడవ నెల దాటాకా తీర్థయాత్రలకు వెళ్ళరాదు.
#6. ఇంటి స్థంబానికి ముహూర్తం వంటివి కూడా భర్త చెయ్యకూడదు. అలానే గృహ ప్రవేశం కూడా చేయకూడదట. వాస్తుకర్మకి దూరంగా ఉండాలి భర్త