Ads
హైదరాబాద్ మహానగరం… ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మహానగరాల్లో ఒకటి. భారతదేశంలో టాప్ ఫైవ్ సిటిస్ లో హైదరాబాద్ కి చోటు ఉంటుంది. నేడు హైదరాబాద్ విశ్వ నగరంగా మారిపోయింది. ప్రపంచ జనాభా అందరూ కూడా హైదరాబాద్ తలెత్తి చూసే విధంగా తన రూపు. మార్చుకుంది.
ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ చాలా అనుకూలమైన నగరంగా పేరు తెచ్చుకుంది.
ఇలా ఒకటేంటి అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రతిరోజు తనని తాను మెరుగుపరుచుకుంటూ ఎందరికో తలదాచుకోవడానికి చోటునిస్తూ ఎన్నో గొప్పలు తనలో నింపుకుంది. హైదరాబాద్ ఇప్పటికిప్పుడు నిర్మించబడ్డ నగరం కాదు. నిజాం నవాబులు పాలించిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ కి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు గుర్తింపు తీసుకువచ్చాయి.
Ads
అలనాటి నిజాం కాలంలో నిర్మించిన కట్టడాలు నేటికీ కూడా ప్రాచుర్యం పొందుతూ టూరిస్ట్ లను ఆకర్షిస్తూ ఉంటాయి.అయితే ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఇప్పటి ఫోటో కాదు. 1880 సంవత్సరం నాటి ఫోటో. అప్పట్లో ఛార్మినార్ వద్ద తీసిన ఫోటో ఇది. చార్మినార్…దానీ చుట్టూ ఉండే కట్టడాలు అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాయి.
అయితే నగరం విస్తరించడం హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి గాంచడంతో ఛార్మినార్ చుట్టూరు కూడా డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. ఛార్మినార్ ఫోటో చూపిస్తే తప్ప అలనాటి ఫోటోలు ఏది చూపించిన ఇది హైదరాబాదా అని అనక మానరు. అప్పటి ఫోటో ఎప్పటి ఫోటో కంపేర్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది మన హైదరాబాద్… మన నగరం… ఇటువంటి నగరంలో మనమందరం ఉంటున్నందుకు గర్వించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు